సౌత్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన అవికా గోర్.. నెపోటిజం అంటూ?

చిన్నారి పెళ్లికూతురుగా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న అవికా గోర్ కు( Avika Gor ) తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది.

ఉయ్యాల జంపాల సినిమాతో( Uyyala Jampala Movie ) తెలుగులో అవికా గోర్ సక్సెస్ సాధించడంతో పాటు మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకున్నారు.

నాగార్జున నిర్మాతగా తెరకెక్కిన ఉయ్యాల జంపాల అవికా గోర్ కెరీర్ ను మార్చేసిందనే సంగతి తెలిసిందే.ఈ కాంబోలోనే సినిమా చూపిస్త మావ తెరకెక్కగా ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి ఫలితాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

రాజు గారి గది3, ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలు సైతం నటిగా అవికా గోర్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.పలు వెబ్ సిరీస్ లలో సైతం నటించి అవికా గోర్ పాపులారిటీని పెంచుకోవడం గమనార్హం.

అవికా గోర్ కొన్ని చిన్న సినిమాలలో నటించినా ఆ సినిమాలు సక్సెస్ సాధించలేదు.

Advertisement

అయితే ఈ బ్యూటీ తాజాగా నెపోటిజం ( Nepotism ) గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. సౌత్ సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువ అంటూ ఈ బ్యూటీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.సౌత్ ఇండస్ట్రీ అంతా స్టార్ హీరోల పవర్ మీదే నడుస్తుందని ఆమె పేర్కొన్నారు.

బాలీవుడ్ తో పోల్చి చూస్తే సౌత్ లో నెపోటిజం కొంచెం ఎక్కువ అని అవికా గోర్ అన్నారు.

హిందీ సినిమాల విషయంలో సౌత్ లో పక్షపాతం ఉందని ఆమె చెప్పుకొచ్చారు.సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతుండగా ఇక్కడి ప్రేక్షకులు ఆ సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారని అవికా గోర్ అన్నారు.సౌత్ ప్రేక్షకులు మాత్రం బాలీవుడ్ సినిమాలకు ఇష్టపడరని ఆమె తెలిపారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ బంధు ప్రీతితో ఉందని అక్కడి ప్రజలు దానినే ఇష్టపడుతున్నారని ఆమె అన్నారు.అవికా గోర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు