ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కంటే తెలివైన అమ్మాయి.. 11ఏళ్లకే మాస్టర్స్‌ డిగ్రీ..!!

మెక్సికో సిటీకి( Mexico City ) చెందిన అధరా పెరెజ్ సాంచెజ్( Adhara Perez Sanchez ) 11 ఏళ్ల బాలిక తన మీద శక్తితో ప్రపంచాన్ని అబ్బురపరిస్తోంది.బాలిక చాలా చిన్న వయస్సులో మాస్టర్స్ డిగ్రీని( Masters Degree ) పొంది అద్భుతమైన ఘనత సాధించింది.

 Autistic Girl With Iq Higher Than Einstein Earns Masters Degree At 11 Details, A-TeluguStop.com

అధరా IQ స్కోర్ 162 ఉండటం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.ఈ స్కోర్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ ఐక్యూల కంటే ఎక్కువ కావడం గమనార్హం.

ఆమె భవిష్యత్తులో నాసాతో కలిసి పనిచేయాలని భావిస్తోంది.ప్రస్తుతం మెక్సికన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి యువ విద్యార్థులకు అంతరిక్ష పరిశోధన, గణితాన్ని చెబుతోంది.

మూడేళ్ల వయస్సులో అధారకు ఆటిజం ఉన్నట్లు నిర్ధారణ అయింది.ఈ మానసిక సమస్యతో బాధపడిన ఈ చిన్నారి పెద్ద ధనవంతురాలు కూడా కాదు.ఆమె తక్కువ-ఆదాయ పొరుగు ప్రాంతంలో పెరిగింది.తల్లి ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చింది.

మానసిక సమస్యలు గల పిల్లలను జాయిన్ చేసే సెంటర్ ఫర్ అటెన్షన్ టు టాలెంట్ (CEDAT)లో చేర్చింది.అయితే అక్కడే ఈ బాలిక అద్భుతమైన IQ బయటపడింది.

బాలిక ఐదేళ్ల వయస్సులోనే ప్రైమరీ స్కూల్ పూర్తి చేసింది.తర్వాత కేవలం ఏడాది కాలంలోనే మిడిల్, హై స్కూల్ ఫినిష్ చేసింది.

ప్రజలు తనను ఎగతాళి చేయడంతో తాను చాలా డిప్రెషన్‌కు గురయ్యానని అధరా తల్లి గుర్తు చేసుకున్నారు.అయినా అధరా నిలకడగా, పట్టుదలతో ఉంది.ఆమె తనకు తాను బీజగణితాన్ని బోధించుకుంది.ఆవర్తన పట్టికను కంఠస్థం చేసింది.అయితే ఇవన్నీ ఎందుకు అని ఆమె తల్లి ఎప్పుడూ విసుగ్గా ఫీల్ అయ్యేది.అయినా ఆ అమ్మాయి తన సాధనను కంటిన్యూ చేసింది.

అధరా కృతనిశ్చయంతో ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంది.

అరిజోనా విశ్వవిద్యాలయం ఆమెకు ఖగోళ భౌతిక శాస్త్రాన్ని అభ్యసించడానికి స్కాలర్‌షిప్‌ను అందించింది.అయితే వీసా సమస్యల కారణంగా అది వాయిదా పడింది.ఎలాంటి సవాళ్లు ఎదురైనా దృఢ సంకల్పం, కష్టపడి విజయం సాధిస్తాయనడానికి అధరా ఒక మంచి ఉదాహరణ.

Girl With IQ Higher Than Einstein Earns Masters Degree

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube