రేగు పండ్లతో బీర్.. అదిరిపోయే లాభాలు!

కొన్ని సార్లు అదృష్టం కలిసిరాకపోయిన తెలివితో అదృష్టవంతులు అవ్వచ్చు అనడానికి ఈ ఘటనే నిదర్శనం.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

రేగు పండ్ల గురించి మనందరికి తెలుసు.రోడ్డు పక్కన చెట్లలో ఈ రేగు పళ్ళు కనిపిస్తుంటాయి.

ఇంకా ఈ రేగు పళ్ళు కొన్ని ప్రాంతాల్లో అంటే ఇండియా, చైనా దేశాల్లో మాత్రమే ఎక్కువ పండుతాయి.దీంతో ఈ పండ్లను ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలకు సప్లై చేసేవారు.

వాటికి డిమాండ్ భారీగా పెరిగిపోవడంతో అక్కడి రైతులు ఈ పండ్లను అక్కడే పండించడం ప్రారంభించారు.ఈ ఏడాది చివరికి రేగుపళ్ళ దిగుపడి భారీగా వచ్చింది.

Advertisement

అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా కేవలం సగం పంట మాత్రమే అమ్ముడుపోయింది.మిగితా అంత డ్యామేజ్ వచ్చింది.

దీంతో ఆ రైతులకు ఏం చెయ్యాలో తెలియలేదు.కానీ ఓ రైతు మాత్రం సరికొత్తగా ఆలోచించాడు.

రేగు పండ్లతో బీర్ తయారు చేయచ్చు అనుకున్నాడు.దీంతో అక్కడ ఉన్న బీర్ కంపెనీని సంప్రదించగా అది అసాధ్యం అని చెప్పారు.

దీంతో అతడే ప్రయోగాలు చేసి చివరికి రేగు పళ్లతో బీర్ చెయ్యడం కనిపెట్టేశాడు.ఆ బీర్ రుచి కూడా బాగుండడంతో బీర్ ను విపణిలోకి రిలీజ్ చేసేందుకు అక్కడి మద్యం కంపెనీలు రెడీ అవుతున్నాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

దీంతో అక్కడ రేగి పళ్ళకు డిమాండ్ భారీగా పెరిగింది.

Advertisement

తాజా వార్తలు