పోలీస్ ఉచిత శిక్షణ కు అరబిందో ఫార్మా చేయూత

త్వరలో నిర్వహించనున్న పోలీస్ రిక్రూట్మెంట్ కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమానికి అరబిందో ఫార్మా చేయూతను అందించింది.జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 51 లో జరిగిన కార్యక్రమంలో అరవింద సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫౌండేషన్ రూ 25 లక్షల చెక్కును వెస్ట్ జోన్ డిసిపి జోయల్ డేవిస్ కు అందజేశారు ‌ ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ అభ్యర్థుల కోసం తాము ఇస్తున్న శిక్షణకు సహాయ సహకారాలు అందించాలని సంస్థ నిర్వాహకులను కలవగా కేవలం పది నిమిషాలలో 25 లక్షల చొప్పున అందించేందుకు ముందుకు వచ్చారని చెప్పారు.

 Aurobindo Pharma For Police Free Training , Police Recruitment , Police Free Tra-TeluguStop.com

పోలీసు లు, ప్రభుత్వం, మనసున్న ఇలాంటి సంస్థలు అందిస్తున్న సహకారంతో శిక్షణ పొందుతున్న ప్రతి అభ్యర్థి రాబోవు రెండు నెలల కాలనీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.సామాజిక మాధ్యమాలకు, సెల్ఫోన్ కు దూరంగా ఉంటూ శిక్షకులు ఇస్తున్న గైడ్ లైన్స్ ను పాటిస్తూ అద్భుత ప్రతిభను కనబరచాలని కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube