పోలీస్ ఉచిత శిక్షణ కు అరబిందో ఫార్మా చేయూత

త్వరలో నిర్వహించనున్న పోలీస్ రిక్రూట్మెంట్ కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమానికి అరబిందో ఫార్మా చేయూతను అందించింది.

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 51 లో జరిగిన కార్యక్రమంలో అరవింద సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫౌండేషన్ రూ 25 లక్షల చెక్కును వెస్ట్ జోన్ డిసిపి జోయల్ డేవిస్ కు అందజేశారు ‌ ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ అభ్యర్థుల కోసం తాము ఇస్తున్న శిక్షణకు సహాయ సహకారాలు అందించాలని సంస్థ నిర్వాహకులను కలవగా కేవలం పది నిమిషాలలో 25 లక్షల చొప్పున అందించేందుకు ముందుకు వచ్చారని చెప్పారు.

పోలీసు లు, ప్రభుత్వం, మనసున్న ఇలాంటి సంస్థలు అందిస్తున్న సహకారంతో శిక్షణ పొందుతున్న ప్రతి అభ్యర్థి రాబోవు రెండు నెలల కాలనీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సామాజిక మాధ్యమాలకు, సెల్ఫోన్ కు దూరంగా ఉంటూ శిక్షకులు ఇస్తున్న గైడ్ లైన్స్ ను పాటిస్తూ అద్భుత ప్రతిభను కనబరచాలని కోరారు.

మహేష్ బాబు కృష్ణవంశీ కాంబో లో మిస్ అయిన మరో సినిమా ఏంటో తెలుసా..?