ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు ప్రారంభం అయ్యాయి.ఈ మేరకు ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 రోజులపాటు క్రీడా సంబురం జరగనుంది.
గుంటూరు జిల్లా నల్లపాడులో ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలను సీఎం జగన్ ప్రారంభించారు.గ్రామ, వార్డు నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు జరగనుండగా ఈ పోటీల్లో దాదాపు 34 లక్షల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇది అందరూ పాల్గొనే గొప్ప పండుగని చెప్పారు.ఈ క్రీడా సంబురాలు దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతాయన్నారు.
ఆరోగ్యం సరిగా ఉండాలంటే జీవితంలో క్రీడలు చాలా అవసరమని పేర్కొన్నారు.క్రీడల వలన అనారోగ్య సమస్యలు దూరమవుతాయన్న సీఎం జగన్ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.