మధ్యప్రదేశ్‌లో దారుణం.. పెళ్లైన రాత్రే వధువుకు కన్యత్వ పరీక్ష.. చివరకు?

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం, ఇండోర్‌ సిటీలో ఒక భయంకరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పెళ్లైన రాత్రే ఓ మహిళను కన్యత్వ పరీక్ష చేయించుకోవాల్సిందిగా అత్తింటి వారు బలవంతపెట్టారు.

ఈ విషయం చివరకు కోర్టు దృష్టికి వచ్చింది, ఈ ఘటన గురించి తెలుసుకొని న్యాయమూర్తి కూడా షాక్ అయ్యారు.అంతేకాదు, ఆమె అత్తమామలపై ఎఫ్ఐఆర్ (FRI)నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

బాధితురాలు బంగాంగా ప్రాంతానికి చెందిన మహిళ కాగా, 2019, డిసెంబర్‌లో భోపాల్‌కు చెందిన వ్యక్తితో పెండ్లి జరిగింది.పెళ్లైన మొదటి రాత్రి తనను కన్యత్వ పరీక్ష (Virginity test)పేరుతో చిత్రహింసలకు గురి చేశారని, దీనివల్ల తాను తీవ్రమైన శారీరక, మానసిక వేదనకు గురయ్యానని ఆమె ఆరోపించింది.

వివాహం జరిగినప్పటి నుంచి ఆమె అత్తమామల నుంచి వేధింపులు మొదలయ్యాయట.ఆమె అత్త నిత్యం ఆమె ప్రవర్తనను తప్పుబడుతూ, ఇతరులతో సంబంధాలు ఉన్నాయని నిందించేది.అంతేకాకుండా, కట్నంగా రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

కొద్ది రోజులకే ఆమె గర్భం దాల్చింది.కానీ, నిరంతర వేధింపులు, నిందల కారణంగా గర్భస్రావం(Miscarriage) జరిగింది.ఆ తర్వాత, మళ్లీ గర్భం దాల్చగా, పుట్టిన బిడ్డ మరణించింది.

దీనితో ఆగని అత్త, మరణించిన బిడ్డకు డీఎన్ఏ పరీక్ష(DNA test for the baby) చేయించాలని డిమాండ్ చేసింది.ఆమెకు మళ్లీ గర్భం రాగా ఆడపిల్ల పుట్టింది.

ఆడపిల్ల పుట్టిందనే కోపంతో, ఆమెను పుట్టింటికి పంపేశారు.

చివరికి, బాధితురాలు జనవరి 18న ఇండోర్ జిల్లా, సెషన్స్ కోర్టులో ఫిర్యాదు చేసింది.మహిళా, శిశు అభివృద్ధి శాఖ నుంచి రహస్య నివేదికను కోర్టు స్వీకరించింది.ఆ నివేదికలో, అత్తమామలు పెళ్లైన రాత్రి కన్యత్వ పరీక్ష పేరుతో ఆమెను తీవ్రంగా అవమానించారని, చిత్రహింసలకు గురి చేశారని తేలింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి22, బుధవారం 2025
ఓరి దేవుడా.. 8 కేజీల బిర్యానీ ఎలా తినేశావేంటి సామీ! వీడియో వైరల్

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు నిర్ణయించింది.ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపింది.ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Advertisement

తాజా వార్తలు