దారుణం : ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండాలని కన్న కూతురినే దేవుడికి బలిచ్చిన తండ్రి...

ప్రస్తుత కాలంలో కొందరు మంత్రగాళ్ళు, మాయగాళ్ళు చెప్పినటువంటి పనులను వింటూ అవగాహన లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలకి తమ జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి.

తాజాగా ఓ వ్యక్తి తన ఇంట్లో ప్రశాంతత కరువైందని ఓ తాంత్రికుడు సంప్రదించి ఆ తాంత్రికుడు చెప్పిన విధంగా తన కన్న కూతురునే నరబలి ఇచ్చి దారుణంగా హత్య చేశాడు.

ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే వాజిద్ అనే వ్యక్తి స్థానిక రాష్ట్రంలోని ఖైకేతా అనే ప్రాంతంలో తన భార్య పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు.

అయితే ఇతడికి ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు.ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ఫ్యాక్టరీలో పనిచేసే వాడు.

ఈ మధ్యకాలంలో కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపించడం వల్ల దగ్గరలో ఉన్నటువంటి ఓ తాంత్రికుడుని సంప్రదించాడు.అయితే ఆ తాంత్రికుడు మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకోవాలంటే ఇంట్లో ఎవర్నో ఒకర్ని నరబలి ఇవ్వాలంటూ సూచించాడు.

Advertisement

దీంతో వాజిద్ తన రెండు సంవత్సరాల కలిగినటువంటి చిన్నారి పాపను నరబలి నెపంతో దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు.ఈ విషయం తెలుసుకున్న  వాజిద్ భార్య వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించింది.

అంతేగాక తన భర్త చేసినటువంటి ఘాతుకాన్నిపోలీసులకు తెలిపి అతడిపై ఫిర్యాదు నమోదు చేసింది.ఈ విషయం తెలుసుకున్న తాంత్రికుడు మరియు నిందితుడు పరారయ్యారు.

నిందితుడి భార్య తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు