ఈ రోజుల్లో మూడు, నాలుగేళ్ల వయసు నుంచే చిన్నపిల్లలు స్మార్ట్‌ఫోన్( Smartphone ) వాడటం మొదలు పెట్టేస్తున్నారు.ముఖ్యంగా యూట్యూబ్ వీడియోలకు అతుక్కుపోతున్నారు.
తల్లిదండ్రులు కూడా వారిని వారించకుండా మొబైల్ ఫోన్లు చేతికి ఇచ్చేసి వాడుకోండి మీ ఇష్టం అన్నట్లు వదిలేస్తున్నారు.ఫోన్‌లో పిల్లలు ఏం చేస్తున్నారు, వారి ప్రవర్తన ఎలా మారుతుందనేది అసలు గమనించడం లేదు.
ఈ తరహా నిర్లక్ష్యం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను వారు అసలు ఊహించలేకపోతున్నారు.చిన్న పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల డబ్బులు పోయినట్లు, పిల్లల ప్రాణాలూ పోయినట్లు రోజూ ఎన్నో వార్తలు వస్తున్నాయి.
అయినా తల్లిదండ్రుల్లో మార్పు కలవడం లేదు.ఈ క్రమంలోనే తాజాగా సెల్ ఫోన్ మరో బాలుడి ప్రాణాలను తీసేసింది.

వివరాల్లోకి వెళితే.రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, కిష్టు నాయక్ తండాకు( Kishtu Naik Tanda ) చెందిన ఉదయ్( Uday ) (11) అనే ఆరో తరగతి విద్యార్థి యూట్యూబ్ వీడియోలను చూడటం అలవాటు చేసుకున్నాడు.ప్రశాంత్, వనిత దంపతులకు ఉదయ్ పెద్ద కుమారుడు.కాగా వారు ఉదయ్‌కి సెల్ ఫోన్ రోజూ ఇచ్చేవారు.అయితే శనివారం రాత్రి డిన్నర్ చేసిన ఉదయ్ తన రూమ్ లోకి వెళ్లి లాక్ వేసుకున్నాడు.అనంతరం యూట్యూబ్‌లో వీడియోలు చూడటం మొదలుపెట్టాడు.
అప్పుడే అతడికి ఒక స్టంట్ వీడియో కనిపించింది.అదే స్టంట్ చేసేందుకు ఉదయ్ ప్రయత్నించాడు.
గోడకు కొట్టిన మేకుకు లుంగీ వేసి స్టంట్ చేయాలనుకున్నాడు కానీ అదే మెడకు బిగుసుకు పోవడంతో ఊపిరాడక చనిపోయాడు.

కొంతసేపటి తర్వాత తల్లిదండ్రులు ఉదయ్‌ని పిలిచారు.కానీ బాలుడు పలకలేదు.తలుపు తీయమని ఎంతసేపు పిలిచినా అతడి నుంచి స్పందన రాకపోవడంతో ఆందోళన పడ్డారు.
తర్వాత తలుపులు పగలగొట్టి చూడగా మేకుకు లుంగీతో ఉరి వేసుకొని బాలుడు కనిపించాడు.దాంతో ఖంగుతిన్న తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్‌కి తరలించారు.అప్పటికే అతడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు.దాంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.