ఆందోనకారులు వినూత్నంగా నిరసనలు తెలియజేస్తూ ఉంటారు.తమ సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేసేందుకు వినూత్నరీతిలో ఆందోళనలు చేపడుతూ ఉంటారు.
దీని వల్ల వారి సమస్య అందరికీ సులువుగా అర్థమవ్వడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దీని వల్ల ప్రభుత్వాల దృష్టికి కూడా సమస్య వెళుతుంది.
దీంతో వినూత్న పద్దతుల్లో కొంతమంది తమ నిరసనలను( Protest ) తెలుపుతూ ఉంటారు.
తాజాగా పంజాబ్ లో ( Punjab ) ఓ పోలీస్ హోంగార్డ్ వినూత్నంగా నిరసన తెలియజేశాడు.
పోలీసుల అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా రోడ్డుపైకి వచ్చాడు.రోడ్డుపై పడుకుని వినూత్నంగా నిరసన తెలియజేశాడు.
తాను నిందితులను అరెస్ట్ చేస్తే కొంతమంది పోలీసులు( Police ) దొంగల దగ్గర డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశాడు.ప్రభుత్వంలో పోలీస్ గా పనిచేసే అతడు ఇలా రోడ్డుపై పడుకుని నిరసన తెలియచేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ గా మారింది.

పంజాబ్ లోని జలంధర్ కి చెందిన హోంగార్డు( Homeguard ) భోగ్ పూర్ ప్రాంతంలో పఠాన్ కోట్ హైవేపై తాడు కట్టి వాహనాలను ఆపేశాడు.అనంతరం రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకుని నిరసన తెలియజేశాడు.పోలీస్ ఇలా చేయడం చేసి అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు.అయితే అక్కడే ఉన్న మరో పోలీస్ అధికారి నిరసన చేస్తున్న హెంగార్డును పైకి లేపే ప్రయత్నం చేశాడు.
అయితే వినకపోవడంతో అతడిని తన్నడం వివాదాస్పదంగా మారింది.

అక్కడ ఉన్న కొంతమంది వాహనదారులు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.దీంతో ఈ వీడియోలు కాస్త వైరల్ అవ్వగా అధికారులు స్పందించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
అయితే తాను దొంగలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తే కొంతమంది పోలీసులు లంచం తీసుకుని వారిని వదిలేస్తున్నట్లు ఈ హోం గార్డు చెబుతున్నాడు.







