కడపలో దారుణం జరిగింది.భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
స్థానిక కోఆపరేటివ్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ముందుగా భార్య, ఇద్దరు పిల్లలను సర్వీస్ రివాల్వర్ తో కాల్చి హత్య చేసిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అనంతరం తాను కూడా కాల్చుకుని బలవన్మరనం చెందాడు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇందులో భాగంగా వ్యక్తిగత కారణాలతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు.
కాగా కడప టూ టౌన్ లో గత రెండేళ్లుగా కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు రైటర్ గా పని చేస్తున్నారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని కడప డీఎస్పీ వెల్లడించారు.







