తమిళ స్టార్ దర్శకుడు అట్లీ( Atlee ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమిళ సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు అట్లీ.
ఇటీవల జవాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్( Shahrukh Khan ) హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు రికార్డుల మోత మోగించింది.
కాగా ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు 50 రోజులు పూర్తి అవుతున్న కూడా ఇప్పటికీ పలు థియేటర్స్‌లో సందడి చేస్తు వసూళ్లు రాబడుతోంది.ఇప్పటి వరకు రూ.1,145 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.అయితే తాజాగా దీనిపై అట్లీ ట్వీట్ చేశాడు.
అలాగే బాలీవుడ్‌లో తొలి ప్రాజెక్ట్ షారుక్ లాంటి స్టార్‌తో చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు.ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో షారుక్, దీపికపై అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సామాన్యుడిగా, దర్శకుడిగా నేను అత్యంత ఇష్టపడే నటుడు షారుక్ ఖాన్.ఆయన గొప్ప నటుడే కాదు గొప్ప నిర్మాత కూడా.ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు.దర్శకుల దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు, తోటి నటీనటుల వరకూ అందరినీ ఎంతో ఎంకరేజ్ చేస్తారు.
ఆయనతో పని చేస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.జవాన్ సినిమా ( Jawaan movie )తర్వాత నా సినిమా భావజాలం గ్రాఫ్ ఎంతో మెరుగయ్యాయి.
దర్శకుడిగా నా ఐదో సినిమానే ఆయనతో చేయడం ఎంతో అదృష్టం.వృత్తి పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ నేనెంతో ఆనందంగా ఉన్నాను.
ఈ సినిమా విడుదలకు ముందు ఎంతో ఒత్తిడికి గురయ్యాను.అది ఎప్పటికీ మరచిపోలేను.పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యాక షారుక్‌తో కలిసి జవాన్ చూశాను.మా ప్రయత్నం వంద శాతం చేశామని దేవుడిని ప్రార్థించాము.అదే సక్సెస్‌ని ఇచ్చింది అని తెలిపారు.అనంతరం హీరోయిన్ దీపికా పదుకొనే ( Deepika Padukone )గురించి మాట్లాడుతూ.
హీరోయిన్ కథ చెప్పగానే అంగీకరించారు.కళ్ళతోనే హావభావాలు పలికించడం ఆమెలో ఉన్న గొప్ప ప్రతిభ.
సన్నివేశంలో ఏదన్నా మార్పు చెబితే వెంటనే మౌల్డ్ అయిపోతుంది.దానికి తగట్టు లుక్స్ మార్చి పాత్రలో లీనమైపోతుంది.
అందుకే డైలాగులు చెప్పే సమయంలో ఎక్కువగా క్లోజప్ షాట్స్ తీశాను అని చెప్పుకొచ్చారు దర్శకుడు అట్లీ.