టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ లను దక్కించుకున్న ముద్దుగుమ్మ సమంత.ఈ అమ్మడు కేవలం సినిమా లు అనే కాకుండా సిరీస్ ల్లో కూడా నటించి మెప్పించింది.
ఇటీవలే విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) తో కలిసి ఖుషి సినిమా( Kushi )లో నటించింది.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం తో తదుపరి సినిమా విషయం లో సమంత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు సమంత( samantha ) తదుపరి సినిమా విషయం లో ఒక నిర్ణయానికి వచ్చిందని.ప్రముఖ దర్శకుడితో సినిమా ను చేసేందుకు గాను సమంత ఒప్పందం చేసుకుంది.ఆ విషయమై త్వరలోనే ప్రకటన రాబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతోంది.సమంత ఏకంగా నాలుగు కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో కొంత మేరకు వాటాను దక్కించుకోబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత ఇప్పటి వరకు ఏ సినిమా కు ఓకే చెప్పలేదు.తాను ఏడాది పాటు బ్రేక్ తీసుకుంటున్న విషయం తెల్సిందే.సమంత సినిమా విషయం లో చాలా మంది అవగాణ లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా లో సమంత అలా.ఇలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.సమంత భారీ ఎత్తున పారితోషికం ఆఫర్ చేసినా కూడా ప్రస్తుతానికి సినిమా ను చేసేందుకు ఆసక్తిగా లేదు.
ఎందుకంటే ఆమె ఏడాది పూర్తిగా విశ్రాంతి తీసుకున్న తర్వాత మాత్రమే కొత్త ప్రాజెక్ట్ లను మొదలు పెట్టాలని భావిస్తోంది.అంటే వచ్చే ఏడాది సమ్మర్ లో సమంత కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సమంత లేడీ ఓరియంటెడ్ సినిమా ను చేయబోతుందా.లేదంటే కొత్త ప్రాజెక్ట్ తో సమంత ఎంట్రీ ఇవ్వబోతుందా అనేది చూడాలి.