ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల రైడర్స్‌కు అలర్ట్.. డ్యాష్‌బోర్డ్‌ ప్రాబ్లమ్‌కు పరిష్కారం చూపిన కంపెనీ..

ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే ప్రముఖ సంస్థ ఏథర్ ఎనర్జీకి( Ather Energy ) ప్రస్తుతం కస్టమర్ల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కొన్న కొంతమంది రైడర్లు కొద్ది రోజులుగా డ్యాష్‌బోర్డ్‌ సమస్య ఫేస్ చేస్తున్నారు.

వారి స్కూటర్‌లకు ప్రభుత్వం నుంచి ఎమర్జెన్సీ అలర్ట్స్ వచ్చిన తర్వాత డ్యాష్‌బోర్డ్‌ ( Dashboard ) పని చేయడం ఆగిపోయింది.ఇటీవల ఇండియన్ గవర్నమెంట్ శాంపిల్ టెస్టింగ్ అంటూ ప్రజలకు ఎమర్జెన్సీ అలర్ట్ పంపిన సంగతి తెలిసిందే.

ఈ హెచ్చరిక చాలా అలర్ట్ ఉండగా దానిని స్కూటర్‌ డ్యాష్‌బోర్డ్ ప్రాసెస్ చేయడానికి కష్టపడింది.ఆ క్రమంలో అది స్టక్ అయింది.

దీన్ని మళ్లీ నార్మల్ వర్కింగ్ కండిషన్‌కు ఎలా తీసుకురావాలో తెలియక ఈ వ్యక్తులకు సహాయం చేయడానికి ఏథర్ ఎనర్జీ వారి X హ్యాండిల్‌లో యూట్యూబ్ వీడియో లింక్‌తో కూడిన ఒక పోస్ట్ షేర్ చేసింది.డాష్‌బోర్డ్‌ను ఎలా రీస్టార్ట్( Restart ) చేయాలో ఈ వీడియోలో వివరించింది.

Advertisement

వీడియో ప్రకారం, డాష్‌బోర్డ్‌ను ఎలా రీస్టార్ట్ చేయడానికి రెండు బ్రేక్‌లను పట్టుకుని, స్టార్ట్ స్విచ్‌ను 10 సెకన్ల పాటు నొక్కాలి.అప్పుడు డాష్‌బోర్డ్ మళ్లీ నార్మల్ గా వర్క్ అవుతుంది.

మరోవైపు ఏథర్ ఎనర్జీ తమ 450X స్కూటర్ మోడల్‌కు ఒక అప్‌డేట్ కూడా ఇచ్చింది.ఈ అప్‌డేట్ స్కూటర్ బ్రేక్ చేసినప్పుడు ఎంత శక్తిని ఆదా చేస్తుందో చూపిస్తుంది.దీనినే రీజెనరేటివ్ బ్రేకింగ్( Regenerative Breaking ) అంటారు.

దీని అర్థం స్కూటర్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి బ్రేకింగ్ నుండి శక్తిని ఉపయోగిస్తుంది.దీంతో స్కూటర్ రీచార్జ్ అవసరం లేకుండా మరింత దూరం వెళ్లేలా చేస్తుంది.

ఏథర్ 450X స్కూటర్ రెండు వెర్షన్‌లను కలిగి ఉంది: కోర్, ప్రో.అవి వేర్వేరు బ్యాటరీ కెపాసిటీస్, ధరలను కలిగి ఉంటాయి.కోర్ వెర్షన్ ధర రూ.1.38 లక్షలు, ప్రో వెర్షన్ ధర రూ.1.53 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).ఈ ధరలు బెంగళూరుకు మాత్రమే వర్తిస్తాయి కాబట్టి కచ్చితమైన ధర తెలుసుకోవడానికి స్థానిక షోరూమ్‌ను విజిట్ చేయాలి.కంపెనీ ప్రస్తుతం 3.7 kWh పెద్ద బ్యాటరీ సైజ్ కోసం కొత్త ఆర్డర్‌లను తీసుకోవడం లేదని గమనించాలి.

ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)
Advertisement

తాజా వార్తలు