మామూలుగా అయితే పిల్లలు స్కూల్లో సెలవు కోసం రకరకాల కారణాలు చెబుతూ ఉంటారు.ఎక్కువగా తమ ఇంట్లో ముసలి వాళ్లు ఎవరో ఒకరు పోయారు అంటూ అబద్దం ఆడుతూ ఉంటారు.
ఆరోగ్యం బాగాలేదని కొందరు అంటూ ఉంటారు.ఇంట్లో పరిస్థితి సరిగా లేదని కొందరు అంటూ ఉంటారు.
ఇలా రకరకాలుగా కారణాలు చెప్పే వారి సంఖ్య భారీగా ఉంటుంది.ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కారణాలు రాస్తారు కాని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఒక కుర్రాడు సెలవు కోసం చెప్పిన కారణం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ కారణం సరే కాని, ఆ కారణంను పట్టించుకోకుండా ప్రిన్సిపల్ సెలవు ఇవ్వడం మరింత విడ్డూరంగా అనిపిస్తుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.కాన్పూర్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సెలవు కోసం ప్రిన్సిపల్‌కు లీవ్ లెటర్ రాయడం జరిగింది.ఆ విద్యార్థికి వెంటనే ప్రిన్సిపల్ సెలవు మంజూరు చేశాడు.
ఆ లీవ్ లెటర్‌ను విద్యార్థి క్లాస్ టీచర్ వద్దకు పంపించారు.ఆ క్లాస్ టీచర్ ఆ లీవ్ లెటర్లో ఏముందా అని చదివింది.
ఆమె అందులోని కారణం చూసి అవాక్కయ్యింది.అతడు తనకు తాను చనిపోయినట్లుగా రాసుకున్నాడు.
ఆ క్లాస్ టీచర్ తన తోటి టీచర్లకు విషయం తెలియజేసింది.ఆ స్కూల్‌కు చెందిన వారు ఎవరో దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో ఆ లీవ్ లెటర్‌ను మామూలుగా పోస్ట్ చేయకుండా ఏకంగా ఆ కుర్రాడికి సెలవు కూడా ప్రిన్సిపల్ ఇచ్చాడు అంటూ పేర్కొన్నారు.దాంతో విషయం రచ్చ రచ్చ అయ్యింది.
ప్రిన్సిపల్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అతడు చేసిన పనికి ఏకంగా అతడి ఉద్యోగం పోయింది.
ప్రిన్సిపల్ కాస్త బాధ్యతతో వ్యవహరించాల్సి ఉందని, పిల్లలు చెప్పే సిల్లీ కారణాలకు ఎలా సెలవులు ఇస్తారని, అది కూడా వారు ఏం కారణాలు చెబుతున్నారో కూడా తెలుసుకోకుండా ఎలా ఉంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ప్రిన్సిపల్‌కు గట్టి పనిష్మెంట్ తప్పలేదు.
ఇంతకు ఆ కుర్రాడు అలా ఎందుకు రాశాడనే విషయానికి వస్తే అసలు తన అమ్మమ్మ చనిపోయిన కారణంగా సెలవు కావాలని కోరాలనుకున్నాడు.కాని ఏదో పరద్యానంలోనో లేక మరేంటో కాని అమ్మమ్మ బదులుగా తానే చనిపోయినట్లుగా చెప్పేశాడు.
దాంతో విషయం కాస్త అక్కడి వరకు వచ్చింది.ఇంతకు అతడి అమ్మమ్మ చనిపోయిందా అని ఎంక్వౌరీ చేస్తే అతడి అమ్మమ్మ అతడు పుట్టక ముందే చనిపోయిందట.
అతడు స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ఇలాంటి ప్లాన్ చేశాడట.
అతడి కుటుంబ సభ్యులు మరియు టీచర్లకు అతడి ప్రవర్తన నోరెళ్లబెట్టేలా చేసింది.8వ తరగతి చదువుతున్న అతడు చేసిన పని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది.అతడి అల్లరి పనికి సరే కాని ఏకంగా అతడి కారణంగా ప్రిన్సిపల్ జాబ్ పోయింది పాపం.
స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.ఇలాంటి కారణం రాస్తాడని అతడు మాత్రం ఎలా ఊహిస్తాడు చెప్పండి.పాపం ఈ విషయంలో ప్రిన్సిపల్‌కు అంత పెద్ద శిక్ష వేయడం కరెక్ట్ కాదని అంతా అభిప్రాయ పడుతున్నారు.ఈ విషయం బయటకు రావడంతో ఇప్పటికే ప్రిన్సిపల్ పరువు పోయింది.
జాబ్ కూడా పోతే అతడి కెరీర్ కే ప్రమాదం.సోషల్ మీడియా ఈమద్య ఎంత పాపులర్ అయ్యిందో ఈ సంఘటనతో మరోసారి నిరూపితం అయ్యింది.