కారణం ఏదైనా కానీ 2020 వ సంవత్సరం బాలీవుడ్ లో వరుస విషాదాలను నింపింది.ఈ ఏడాది బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు మృతి చెందడం కలకలం రేపింది.
జూన్ లో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన తరువాత బాలీవుడ్ లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.పలువురు ప్రముఖులు ఈ సంవత్సరంలో మృతి చెంది అభిమానుల్లో పెను విషాదాన్ని నింపారు.
ఇంకా వారి మృతి వార్తలు మరువక ముందే మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు అసిఫ్ బాస్రా మృతి చెందినట్లు తెలుస్తుంది.హిమాచల్ ప్రదేశ్ లోని మెక్లియోడ్ గంజ్ లోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఆయన ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు సమాచారం.
ఆయన వయసు 53 సంవత్సరాలు కాగా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆసిఫ్ బాస్రా ఈ రోజు(గురువారం) ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని అక్కడి కార్యక్రమాలు పూర్తి చేసి మృతదేహం ను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినట్లు తెలుస్తుంది.అయితే ఈ పోస్టుమార్టం రిపోర్ట్ వెల్లడైన తరువాత అసలు విషయం తెలియాల్సి ఉంది.
అయితే సంఘటనా స్థలి లో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించకపోవడం తో పోలీసులు విచారణ చేపట్టారు.

ధర్మశాల లోని మెక్లియోడ్ గంజ్ లోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో గత 5 సంవత్సరాలుగా ఆయన నివాసం ఉంటున్నారని, అయితే ఆయనతో పాటు ఒక ఫారెన్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటున్నట్లు తెలుస్తుంది.అయితే ఆయన ఆత్మహత్య కు ఎందుకు పాల్పడ్డారు అన్న దానిపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు.దీనికి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
బాలీవుడ్ లో బ్లాక్ ఫ్రైడే, పర్జానియా, ఔట్ సోర్స్డ్, జబ్ వి మెట్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, కై పో చే, క్రిష్ 3, ఏక్ విలన్, కాలకాండి, హిచ్కి వంటి చిత్రాల్లో ఆసిఫ్ బాస్రా నటించారు.