భారత సంతతి వ్యక్తికి..అమెరికాలో అత్యంత అరుదైన పురస్కారం..!!!

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అలజడిని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా , వేలాది మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారు.

ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికాలో ఈ పరిస్థతి మరీ ఘోరంగా తయారయ్యింది.కంపెనీలు మూత పడటంతో ఎంతో మంది నిపుణులు, సామాన్య ప్రజలు సైతం ఆకలితో అలమటించిన పరిస్థితులు నేటికి కన్పిస్తూనే ఉన్నాయి.

లాక్ డౌన్ విధించడంతో తిండి దొరకక పస్తులు ఉన్న వారి సంఖ్య పెరిగిపోతూ వచ్చింది.ఈ క్రమంలో అమెరికాలో ఆకలితో అల్లాడి పోయిన లక్షలాది మందికి ఆహరం అందించి దాతృత్వం చాటుకున్న భారత సంతతి వ్యక్తి, ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా ని అమెరికా అరుదైన పురస్కారం అందించి సత్కరించింది.

వికాస్ ఖన్నా కరోనా సమయంలో అమెరికా ప్రజలకి చేసిన సేవలను గుర్తించిన ఆసియా సొసైటీ సంస్థ ఆయన్ని 2020 ఆసియా గేమ్ పురస్కారంతో సత్కరించింది.ఈ పురస్కారానికి కేవలం ఆరుగురిని మాత్రమే ఎంపిక చేయగా వారిలో వికాస్ ఖన్నా ఒకరు కావడం గమనార్హం.ఇదిలా ఉంటే అమెరికాలో మాన్ హోటల్ లో ఉంటున్న విఖాస్ ఫీడ్ ఇండియా డ్రైవ్ కార్యక్రమం ద్వారా సుమారు 3.50 కోట్ల మందికి భోజనాలు , 35 లక్షల మందికి శానిటైజర్ లు దాదాపు 4 లక్షల మందికి చెప్పులు 20 లక్షల మాస్కులు , నిత్యావసర వస్తువులు అందించారు.దాంతో ఆయన దాతృత్వాన్ని, సేవా గుణాన్ని చూసిన సదరు సంస్థ ఈ పురస్కారానికి ఎంపిక చేసిందని స్థానిక మీడియా తెలిపింది.

Advertisement

ఇక వికాస్ తో పాటు అవార్డ్ అందుకునే వారిలో టెన్నిస్ క్రీడాకారుడు నావోమి , పారాసైట్ చిత్ర నిర్మాణ సంస్థ మికీ లీ, ప్రముఖ వ్యపారా వేత్త జో, క్లారా సాయ్ లు ఉన్నారు.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు