చిన్ననాటి ఆనందాలంటూ ఆ ఫోటో షేర్ చేసిన అషు రెడ్డి.. ఓర్నీ దీనికేనా అంటూ ట్రోల్స్?

సోషల్ మీడియా ద్వారా స్టార్ గా మారి ఇండస్ట్రీలో బాగా దూసుకుపోతున్న అషురెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.బుల్లితెర ఆర్టిస్ట్ గా అషు రెడ్డి తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.

 Ashu Reddy Shared That Photo As Childhood Happiness Or Is It Trolls , Ashu Reddy-TeluguStop.com

పైగా తెగ అవకాశాలు అందుకుంటూ బాగా బిజీగా ఉంటుంది.నిజానికి ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోయింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అవకాశం అందుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఈ బ్యూటీ తన గ్లామర్ తో మాత్రం కుర్రాళ్ళను పిచ్చెక్కించింది.

నిజానికి ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడుపుతుంది.అషు తొలిసారిగా డబ్స్మాష్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంది.

ఇక చూడటానికి సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడటంతో జూనియర్ సమంత అని పేరు కూడా సంపాదించుకుంది.

అలా అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశం అందుకుంది.

అంతేకాకుండా బుల్లితెరలో గతంలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.

విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈమె పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.

Telugu Anchor Ravi, Ashu Reddy, Bigg Boss, Childhood, Rahul Sipligunj-Movie

ఈమె గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది.

ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది.ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.

అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.

ఇక ఇందులో మరో కంటెస్టెంట్ అజయ్ తో బాగా రచ్చ చేసింది.

Telugu Anchor Ravi, Ashu Reddy, Bigg Boss, Childhood, Rahul Sipligunj-Movie

బిగ్ బాస్ తర్వాత మళ్లీ నెట్టింట్లో తన రచ్చ మొదలు పెట్టింది.ప్రతి రోజు ఫోటోలు షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు దారుణమైన ట్రోల్స్, కామెంట్లు పెడుతూ ఉంటారు.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.అందులో పెప్ట్ స్కూటీ ఫోటో పంచుకొని చిన్ననాటి ఆనందాలు అంటూ తెలిపింది.

ఇక ఆ కొత్త బండికి పూజ చేయించినట్లు కూడా కనిపించింది.దీంతో ఆ ఫోటోని చూసిన వాళ్లంతా ఓర్నీ దీనికేనా ఇంత అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube