Ashu Reddy Venu Swamy: లగ్జరీ కారు కొనుగోలు చేసిన అషు రెడ్డి.. వేణు స్వామి స్పందన ఇదే?

అషురెడ్డి.( Ashu Reddy ) ఈ పేరు గురించి ఈ బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Ashu Reddy Buys A Range Rover Venuswamy Completes Rituals-TeluguStop.com

మొదట సోషల్ మీడియాలో డబ్బు స్మాష్ వీడియోల ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఆమె ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ కి( Bigg Boss ) ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.స్టార్ హీరోయిన్ సమంత మాదిరిగా ఉండడంతో ఈమె జూనియర్ సమంత గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

ఇకపోతే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లతో యువత మతి పోగొడుతూ ఉంటుంది.

ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ని( Ram Gopal Varma ) బోల్డ్ ఇంటర్వ్యూ చేసి బోల్డ్ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో ఏకంగా రెండుసార్లు అవకాశం దక్కించుకుని షాక్ ఇచ్చింది.తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలిచే అషురెడ్డి తాజాగా కూడా మరోసారి వార్తల్లో నిలిచింది.తాజాగా లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్ కారు( Range Rover ) కొనుగోలు చేసిన అషురెడ్డి తన కారుకు ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష్యుడు వేణు స్వామి తో( Venu Swamy ) కొబ్బరికాయతో దిష్టి తీయించి పూజ చేయించింది.

అనంతరం ఆమె కూడా ఒక కొబ్బరికాయను కొట్టింది.ఆ తర్వాత వేణు స్వామి మాట్లాడుతూ.

తనను నమ్మిన వారు ఇలా వృద్ధిలోకి వస్తుంటే చాలా ఆనందంగా ఉంటుందని, ఆ ఆనందం మామూలుది కాదని ఆయన చెప్పుకొచ్చారు.కేవలం అషు రెడ్డి మాత్రమే కాకుండా వెండితెరపై ఉండే స్టార్ హీరోయిన్లు చాలామంది వేణు స్వామితో పూజలు చేయించుకున్న విషయం తెలిసిందే.అలా వేణ స్వామి పూజలు చేయించుకున్న చాలా మంది అవకాశాలను అందుకుంటూ దూసుకుపోవడంతో పాటు మంచి వృద్ధిల్లోకి వచ్చినట్లు వేణు స్వామి స్వయంగా తెలిపారు.కాగా వేణు స్వామి నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం విషయంలో ఆయన చెప్పినట్లే జరగడంతో అప్పటినుంచి ఈయన క్రేజ్ మరింత పెరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube