తెలంగాణ స్లాంగ్ తో వీడియోలు చేస్తూ ఎంతో పాపులర్ అయినటువంటి వారిలో దేత్తడి హారిక( Dethadi Harika ) ఒకరు.ఈమె ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ వీడియోలు, కవర్ సాంగ్స్ చేస్తూ చాలా పాపులర్ అయ్యారు ఇలా యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి దేత్తడి హారిక అనంతరం బిగ్ బాస్ ( Bigg Boss ) అవకాశాన్ని కూడా అందుకున్నారు.
బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాలను అందుకున్నారు.ఇలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ మరోవైపు తన యూట్యూబ్ వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ అంటూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమెకు తాజాగా హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది.
బేబీ సినిమా ( Baby Movie ) ద్వారా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి డైరెక్టర్ సాయి రాజేష్ తన తదుపరి సినిమాల పనులలో ఎంతో బిజీ అవుతున్నారు.ఈ క్రమంలోనే సాయి రాజేష్ తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతున్నాయని సమాచారం.
బేబీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సాయి రాజేష్( Sai Rajesh ) మరొక సినిమా చేస్తున్నారు అంటే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.మరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకున్నారు దేత్తడి హారిక.ఈ సినిమాలో హీరో ఎవరు అనే విషయానికి వస్తే వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి నటుడు సంతోష్ శోభన్ ( Santosh Sobhan ) ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు.
సంతోష్ ఇప్పటివరకు పలు సినిమాలలో నటించిన ఈయనకు సరైన హిట్ మాత్రం పడటం లేదు.మరి సాయి రాజేష్ అయిన తనకు హిట్ అందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు అధికారికంగా ప్రకటించనున్నారు.