కొన్నేళ్ల క్రితం వరకు సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న జోడీలకు మాత్రమే ప్రేక్షకుల్లో ఎక్కువగా క్రేజ్ ఉండేది.ఈ మధ్య కాలంలో సినిమా జోడీలకు సమానంగా బుల్లితెర జోడీలకు కూడా ప్రేక్షకుల్లో క్రేజ్ వస్తోంది.
అలా గుర్తింపును సంపాదించుకున్న జోడీలలో ఎక్స్ ప్రెస్ హరి అషురెడ్డి జోడీ కూడా ఒకటి.టిక్ టాక్ వీడియోలు, బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న అషురెడ్డి కామెడీ స్టార్స్ షోలో ఎక్స్ ప్రెస్ హరితో కలిసి స్కిట్లు చేస్తూ నవ్వులపువ్వులు పూయిస్తున్నారు.
కొన్ని నెలల క్రితం రాహుల్ సిప్లిగంజ్ పెట్టిన పోస్టుల వల్ల వార్తల్లో నిలిచిన అషురెడ్డి ప్రస్తుతం ఎక్స్ ప్రెస్ హరితో కలిసి స్కిట్లు చేస్తుండటంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వైరల్ అయ్యాయి.తెరపై స్కిట్లు చేసే సమయంలో నిజమైన ప్రేమికులు అనేంతలా ఈ జోడీ జీవిస్తుండగా అషురెడ్డి మాత్రం లైవ్ చాట్ లో ఎక్స్ ప్రెస్ హరిని అన్నయ్య అని పిలుస్తున్నారు.
కానీ తెరపై మాత్రం ఈ జోడీ చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు.

అషురెడ్డి హరి జోడీకి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అయితే ఈ ఇద్దరు కలిసి ఇంట్లో రచ్చరచ్చ చేశారు.హరి, అషురెడ్డితో పాటు కామెడీ స్టార్స్ షోకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంతోష్, మరో వ్యక్తి ఇంట్లో అష్టచమ్మా ఆడుకున్నారు.
కరోనా వల్ల ఇంటికే పరిమితమైన అషురెడ్డి, కామెడీ స్టార్స్ టీమ్ కరోనా సమయాన్ని ఈ విధంగా వాడుకుంటున్నారు.కామెడీ స్టార్స్ షోలో పాల్గొన్న రీల్ జోడీలకు మంచి గుర్తింపు వస్తోంది.
అవినాష్ అరియానా, రవి లాస్య, ఎక్స్ ప్రెస్ హరి అషురెడ్డి జోడీలు ఈ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్నాయి.ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 : 30 గంటలకు ఈ షో ప్రసారమవుతుండగా జబర్దస్త్ షోకు సమానంగా ఈ షో రేటింగ్స్ ను సొంతం చేసుకుంటోంది.