వెనక్కి తగ్గం.. యథావిధిగా వినాయక చవితి  గవర్నర్ తో భేటీ తర్వాత బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పష్టీకరణ

వినాయక చవితి కి సంబంధించి రాష్ట్రంలో వైసిపి సర్కారు అనుసరిస్తున్న తీరుపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండిపడుతుంది.ఆదిశగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

 As Usual After The Meeting With Governor Vinayaka Chaviti Than The Bjp Leader K-TeluguStop.com

ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు.వైసీపీ ప్రభుత్వం వచ్చాక హిందూ మతం మీద.హిందూ దేవుళ్ళ పై దాడులు జరుగుతున్నాయని బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ తో భేటీ అనంతరం అన్నారు.వైసీపీ ప్రభుత్వం వచ్చాక అనేక సంఘటనలు జరిగాయని అయినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని విమర్శించారు.

150కి పైగా ఘటనలు జరిగినా ఒక్కరిని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.వినాయక చవితిని ఇంట్లోనే జరుపుకోండని ప్రభుత్వం జీవో ఇవ్వడాన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తరఫున ఖండిస్తున్నామన్నారు.

సినిమా హాళ్లు, స్కూలుకు, బార్లకు లేని ఆంక్షలు వినాయక చవితి ఉత్సవానికి ఎందుకని కన్న ప్రశ్నించారు.గవర్నర్ జోక్యం చేసుకొని వినాయకచవతి జరుపుకునేలా అనుమతి ఇవ్వాలని బీజేపీ తరఫున కోరామని తెలిపారు.

మొహరం, వైయస్ వర్ధంతి సభలో ఇచ్చినట్టే తమకు 50 మందితో అనుమతినివ్వమి కోరామన్నారు.గత సంవత్సరం అడగలేదని ప్రస్తుతం కేసులు తగ్గాయి కాబట్టే డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా పండుగను జరిపి తీరుతామని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube