రోడ్డు వెడల్పు లో భాగంగా గ్రామపంచాయతీ మార్కింగ్ ప్రకారంగా ఇండ్లను సరిచేసు కుంటాం.

సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డితో టెంకాయ కొట్టించి పనులను ప్రారంభించుకున్న ఇండ్ల యజమానులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట గనగోని సంతోష్ గౌడ్ ఇంటి నుండి బొగ్గు సయ్యద్ ఇంటి వరకు రోడ్డు వెడల్పు లో భాగంగా ఇరువైపులా గ్రామపంచాయతీ మార్కింగ్ ప్రకారం ఇండ్లను 33 ఫీట్ల కు సరి చేసుకుంటామని ఇంటి యజమానులు గనుగొని సంతోష్ గౌడ్ ,గాండ్ల లక్ష్మి , బాలలక్ష్మి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

గురువారం శ్రీ ఆంజనేయ స్వామి జయంతి అయినప్పటికీ వారు గ్రామపంచాయతీకి వచ్చి సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ని వార్డు సభ్యులను వారు కలిసి 33 ఫీట్ల రోడ్డు వెడల్పులో భాగంగా గ్రామపంచాయతీ వారు మార్కింగ్ చేసిన ప్రకారంగా తామే తమ ఇళ్లను తొలగించుకొని సరి చేసుకుంటామని వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.గురువారం శ్రీ ఆంజనేయ స్వామి జయంతి రోజే సర్పంచు పాలకవర్గం సభ్యులు వచ్చి టెంకాయ కొట్టి ప్రారంభించాలని వారు కోరారు.

వారి విజ్ఞప్తి మేరకు సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి , ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ పాలకవర్గం సభ్యులు గురువారం గనగోని సంతోష్ గౌడ్ ఇంటి వద్ద టెంకాయలు కొట్టి అట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ సంతోష్ గౌడ్ ఇంటి నుండి బొగ్గు సయ్యద్ ఇంటి వరకు రోడ్డు వెడల్పులో భాగంగా 33 ఫీట్ల రోడ్డు కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఇళ్లను తొలగించుకొంటే 10 సిమెంట్ సంచులు , ఒక ట్రాక్టర్ ఇసుక తన స్వంత ఖర్చులతో ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఈనెల 26 తేదీ వరకు రోడ్డు వెడల్పులో భాగంగా గ్రామపంచాయతీ మార్కింగ్ పెట్టిన ప్రకారం తమ ఇళ్ళను తొలగించుకోవాలని ఇంటి యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.తొలగించుకొని ఎడల వాటిని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తొలగించబడునని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

Advertisement

తమ ఇళ్ళను తొలగించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సంతోష్ గౌడ్ ను, గాండ్ల లక్ష్మిని , బాల లక్ష్మి లను ఆయన గ్రామస్తుల సమక్షంలో అభినందించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జవాజి లింగం , పందిల్ల శ్రీనివాస్ గౌడ్, గడ్డమీద లావణ్య, ద్యాగం లక్ష్మీనారాయణ, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , గ్రామస్తులు సర్వయ్యగారి పద్మారెడ్డి, నేవూరి శ్రీనివాస్ రెడ్డి , నాగుల ప్రదీప్ గౌడ్ , దోనుకుల కళ్యాణ్ , అజిముద్దీన్ , దాస్ , సుంకి భాస్కర్ ఇంటి యజమానులు తదితరులు పాల్గొన్నారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?
Advertisement

Latest Rajanna Sircilla News