ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన అరుణ్ పిళ్లైకి కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఈ మేరకు ప్రత్యేక కోర్టు ఏప్రిల్ 3 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే.
ఏప్రిల్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిళ్లైని కోర్టులో హజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది.