ఒకపక్క కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ మృగాళ్లు మాత్రం అఘాయిత్యాలు ఆపడం లేదు.బాలిక సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా సరే అత్యాచారాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.
ఉరి శిక్ష వేసిన, నిర్భయ లాంటి కఠిన చట్టాలు అమలు అవుతున్న సరే అభం శుభం తెలియని మైనర్ బాలికలు ఇంకా కామందులు చేతుల్లో చిక్కి విలవిల్లాడుతున్నారు దేశం విపత్తుర పరిస్థితుల్లో ఉన్న ఇవేవీ పట్టనట్టు మానవమృగాలు రెచ్చిపోతున్నారు.మహిళలు బాలికల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం లేకుండా పోతుంది.
,/br>
ఏపీలో దిశ చట్టం తీసుకుని వచ్చిన రోజురోజుకీ అత్యాచారాలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది.మొన్నటికి మొన్న విశాఖ ఏజెన్సీలోని ఓ మైనర్ మైనర్ బాలికపై అత్యాచారం మర్చిపోకముందే తాజాగా మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
గుంటూరులో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు జోష్ బాబును పోలీసులు అరెస్టు చేశారు.బాలిక తల్లిదండ్రులకు మీ అమ్మాయి న్యూడ్ వీడియోలు ఉన్నాయంటూ నిందు బెదిరించాడు.బాలిక తల్లిదండ్రుల వద్ద నుంచి 3.30 లక్షలు బెదిరించి తీసుకున్నాడు.నిందితుడు జోష్ బాబు ఇంజనీరింగ్ చదివి ఓ ఆసుపత్రిలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు.జ్యోష్ బాబు వద్ద నుంచి గోల్డ్ చైన్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
గుంటూరు సౌత్ డిఎస్పి ప్రశాంతి మాట్లాడుతూ మహిళలు అనవసరంగా మోసగాళ్లు మాటల్లో పడవద్దని మహిళల భద్రత కోసం పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు.ఇబ్బందులకు గురి అయితే పోలీసులకు వెంటనే సంప్రదించాలని ఎటువంటి భయం లేకుండా ఫిర్యాదు చేయాలని అని తెలిపారు
.