మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అన్ని పోలింగ్ బూత్‌లకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు.అన్ని పోలింగ్ బూత్‌లకు మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రతి పోలింగ్ బూత్‌ను కవర్ చేసే విధంగా సాధారణ పరిశీలకుడితో సంప్రదించి, సీఏపీఎఫ్‌ను విస్తరించడం జరుగుతుందని అన్నారు.ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గం ఉన్న రెండు జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు.
ఎన్నిక పారదర్శకంగా నిర్వహించడానికి వీలుగా, ఈ పక్రియలో ప్రజలను భాగస్వాములను చేయడానికి ‘cvigil’ అప్లికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని సీఈఓ తెలిపారు, అదేవిధంగా ఫిర్యాదులను వంద నిమిషాల వ్యవధిలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు ఇచ్చినా, మద్యం పంచినా ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.