ఐపీఎల్ లో అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ... కాకపోతే...?!

భారతదేశంలో క్రికెట్ గురించి మాట్లాడితే అందులో తప్పకుండా మాట్లాడే వ్యక్తి సచిన్ టెండూల్కర్.భారతదేశంలో ఆయనను క్రికెట్ దేవుడిగా పరిగణిస్తారు.

ఎన్నో సాధ్యం కాని రికార్డ్ లను సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ కెరీర్ లో సాధించారు. 2011 వరల్డ్ కప్ గెలిచిన జట్టు సభ్యులలో కూడా ఆయన ఒకరు.

సచిన్ క్రికెట్ ప్రస్థానం ముగిసిన తర్వాత ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్ లో సత్తా చాటుతూ జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించడానికి అహర్నిశలు కష్ట పడుతున్నాడు.ఇదివరకు మొదటగా బ్యాట్స్ మెన్ గా ప్రయత్నాలు చేసిన అర్జున్ టెండూల్కర్ అక్కడ పోటీ ఎక్కువగా ఉండడంతో చివరికి బౌలర్ గా అవతారమెత్తాడు.

ప్రస్తుతం 20 సంవత్సరాలు ఉన్న అర్జున్ టెండూల్కర్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్ లో కెరియర్ మొదలు పెట్టకపోయినా, దేశవాళీ క్రికెట్ లో మంచి బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడు.ఇకపోతే అర్జున్ టెండూల్కర్ తాజాగా ఐపీఎల్ 2020 సీజన్ కు సంబంధించి ప్రొఫెషనల్ ప్లేయర్ గా మాత్రం కాకుండా నెట్ బౌలర్ గా ముంబై ఇండియన్స్ కు సేవలు అందించబోతున్నాడు.

Advertisement

తన తండ్రి సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టు మెంటర్ గా వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టుకు నెట్ బౌలర్ గా సేవలు అందిస్తున్నాడు.

ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ తో పాటు అర్జున్ టెండూల్కర్ కూడా దుబాయ్ చేరుకున్నాడు.ఇక అక్కడ ముంబై ఇండియన్స్ జట్టు ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ లాంటి స్టార్ లకు బౌలింగ్ చేస్తూనే మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న బూమ్రా, బౌల్ట్ లాంటి స్టార్ ఆటగాళ్లు వద్ద బౌలింగ్ సంబంధించిన మెలుకువలను నేర్చుకుంటున్నాడు.

చూడాలి మరి వచ్చే ఐపీఎల్ సీజన్ కి అయినా అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ లో ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ గా కనపడతాడో లేదో.

పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు