మీరు తప్పు చేసి బీజేపీని విమర్శిస్తారా?: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

విచారణకు సహకరించకుండా ఇంతకాలం కవిత తప్పించుకున్నారని పేర్కొన్నారు.

చట్ట పరిధిలోనే ఈడీ దర్యాప్తు చేస్తోందన్న కిషన్ రెడ్డి కవిత కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.అవసరమైన ఆధారాలు సేకరించామని ఈడీ చెప్తోందని తెలిపారు.

మీరు తప్పు చేసి బీజేపీని విమర్శిస్తారా అని ధ్వజమెత్తారు.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ తో సినిమా అంటే అది ఉండాల్సిందే.. యంగ్ హీరో కార్తికేయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు