Viral Video : కొడుకును కోల్పోయిన టీచర్‌కు హార్ట్ టచింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన స్టూడెంట్స్..

ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఉండే అనుబంధం చాలా మధురమైనది అని చెప్పుకోవచ్చు.టీచర్లు( Teachers ) తమ విద్యార్థులకు గణితం లేదా చరిత్ర వంటి సబ్జెక్ట్స్‌ గురించి మాత్రమే కాకుండా జీవితం గురించి కూడా ముఖ్యమైన పాఠాలను బోధించడానికి కృషి చేస్తారు.

 Students Surprise Teacher After Her Sons Death-TeluguStop.com

అందుకే విద్యార్థులు తమ ఉపాధ్యాయులను ఒక గైడెన్స్, ఒక రోల్ మోడల్‌గా( Role Model ) చూస్తారు.అంతేకాదు వారిని పేరెంట్స్, ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు.

తాజాగా ఇలాంటి హార్ట్ టచ్చింగ్( Heart Touching Relation ) అనుబంధాన్ని చూపించే వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌( Instagram )లో వైరల్ గా మారింది.ఈ వీడియో డిస్క్రిప్షన్ ప్రకారం ఒక ఉపాధ్యాయురాలు సంవత్సరం క్రితం తన కొడుకును పోగొట్టుకుంది.

ఆ వ్యక్తిగత నష్టం వల్ల ఆమె దుఃఖిస్తూ ఉంది.అయితే ఇటీవల విద్యార్థులు ఆమెను దయతో ఓదార్చారు.

ఈ క్లిష్ట సమయంలో ఆమెకు మద్దతుగా నిలిచారు.

విద్యార్థులందరూ కలిసి చీకటి గదిలో( Dark Room ) ఆమె చనిపోయిన కొడుకు పేరును ఉచ్చరించడానికి గ్లో స్టిక్స్‌ను ఉపయోగించారు.ఆమెను ఉత్సాహపరిచేందుకు పాటలు కూడా పాడారు.ఈ ఎమోషనల్ మూమెంట్‌( Emotional Moment )ను వీడియోలో క్యాప్చర్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ఉపాధ్యాయురాలు హాలులో ఒక గదిలోకి వెళుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది, అక్కడ ఆమె కోసం ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.రూమ్‌లోని నేలపై ఆమె కొడుకు పేరును గ్లో స్టిక్స్ కాంతి( Glow Sticks Light )తో సృష్టించడం మనం చూడవచ్చు.

విద్యార్థులు మెరుస్తున్న నివాళి చుట్టూ నిలబడి, మెల్లగా పాడారు.

టీచర్ దృష్టిలో పడటంతో, ఆమెకు తన కొడుకు గురించిన మంచి మాటలు రాసి పోస్టర్లను అందజేసారు.ఉద్వేగానికి లోనైన ఆమె ఏడవడం ప్రారంభించింది.ఈ వీడియో చాలా మంది హృదయాలను తాకింది, నెటిజన్లు( Netizens ) ఈ టీచర్, విద్యార్థుల మధ్య ఉన్న బంధం చూసి ప్రేమ, ప్రశంసలను కురిపించారు.

చాలా మంది ఈ వీడియో తమను కన్నీళ్లు పెట్టించిందని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube