ఆరోగ్య భీమా తీసుకుంటున్నారా..? అయితే మీరు ఇవి తెలుసుకోవాల్సిందే..!

ప్రస్తుత రోజుల్లో బీమా అనేది చాలా ముఖ్యమైన అవసరంగా మారిపోయింది.అంతేకాదు బీమా ఉండటం ద్వారా మీకు, మీ కుటుంబానికి ఎంతగానో సహాయపడుతుంది కూడా.

ఈ మధ్యకాలంలో అనేక కొత్త కొత్త వ్యాధులు పుట్టుకు రావడంతో వాటి బారిన ప్రజలు పడి పెద్ద ఎత్తున డబ్బులను ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో ఇప్పుడు కేవలం జీవిత బీమా మాత్రమే కాకుండా హెల్త్ పాలసీ తీసుకోవడం కూడా అంతే ముఖ్యంగా మారింది.

దీనికి కారణం రోజురోజుకీ వైద్యసేవలు ఖర్చులు ఎక్కువగా ఉండటంతో అది సామాన్యుడికి భారంగా కనబడుతోంది.మనము లేదా మన కుటుంబ సభ్యులు తీవ్రమైన అనారోగ్యం పాలైనప్పుడు లేదా ఏదైనా అనుకోకుండా ప్రమాదానికి గురైన సమయంలో హెల్త్ పాలసీ మాత్రమే మనల్ని ఆదుకుంటుంది.

ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు చేతిలో డబ్బులు లేకపోతే మనల్ని కాపాడే ప్రయత్నం చేసేది హెల్త్ పాలసీ మాత్రమే.అయితే చాలామంది ఈ హెల్త్ పాలసీ చేసే ముందు కొన్ని విషయాలను తెలుసుకోకుండానే చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు.

Advertisement

మొదట్లో వాటిని పట్టించుకోకుండా హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన, ఆ తర్వాత వాటిని క్లైమ్ చేసుకునే సమయంలో పెద్ద ఇబ్బందులను గురిచేస్తాయి.కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి అంశాలను పరిశీలించాలో ఓసారి చూద్దాం.

ఏదైనా హెల్త్ పాలసీ చేసే సమయంలో మీరు ఎంత కవరేజి చేయబోతున్నారు అన్న అంశంపై కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి.ముఖ్యంగా ప్రీమియం తగ్గుతుంది అన్న నెపంతో తొందరపడి కవరేజి తక్కువగా ఉన్న పాలసీలను ఎంచుకోకుండా చూసుకోవాలి.

అలాగే మీరు తీసుకుపోయే హెల్త్ పాలసీ మీ వైద్య ఖర్చులకు సరిపోయేలా ఉన్నాయో లేదో ముందుగానే ఓ అంచనా వేసుకోవాలి.అలాగే పాలసీ తీసుకునే సమయంలో మీ కుటుంబ సభ్యుల సంఖ్య అలాగే వారికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని దాని విధంగా పాలసీ కవరేజ్ ను ఎంచుకోవాలి.

అలాగే మీరు తీసుకున్న పాలసీలు ప్రస్తుతం ఆసుపత్రిలో వేసే ఖర్చులను కూడా కలిపి లెక్క వేసుకుని ఎంచుకోవాలి.ఇదివరకే మీకు హెల్త్ పాలసీ చేసినట్లయితే ఆ తర్వాత వాటిని టాప్ అప్ ప్లాన్ ద్వారా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఇలాంటి జాగ్రత్తలు పాటించి హెల్త్ ఇన్సూరెన్స్ లను చేయడం ఎంతో శ్రేయస్కరం.

Advertisement

తాజా వార్తలు