నారా లోకేష్.. పానకంలో పుడక?

ఏ తండ్రి అయినా, తన కొడుకు తండ్రిని మించినవాడు అవ్వాలని కోరుకుంటాడు.అలా తీర్చిదిద్దేందుకు తండ్రి తనవంతు ప్రయత్నాలు చేస్తాడు.

 Are Ycp Leaders Not Considering Nara Lokesh , Andhra Pradesh , Nara Lokesh , Cha-TeluguStop.com

కానీ, ఆయన్ను మించి ఎదగాలంటే, తనయుడే కసరత్తులు చేయాలి.తనదైన ముద్ర వేస్తూ.

దూసుకెళ్లిపోవాలి.కానీ.

ఇక్కడ నారా లోకేష్ వ్యవహార శైలి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.కేవలం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడిగా మాత్రమే లోకేష్‌కు గుర్తింపు ఉందే తప్ప.

ఆయనకంటూ ప్రత్యేక ఉనికి లేదని తేల్చి చెప్తున్నారు.

లోకేష్‌ పానకంలో పుడక లేదా కూరలో కరివేపాకులా ఉన్నారంటూ అధికార పార్టీ నేతలు కూడా సెటైర్లు వేస్తున్నారు.

ఏనాడైనా సీఎం జగన్ నోటి వెంట లోకేష్ పేరు రావడాన్ని గమనించారా? ఆయన ఎప్పుడూ విమర్శించినా.చంద్రబాబునే.

లోకేష్ గురించి పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు.ఆయన దృష్టిలో లోకేష్ అంటే.

కేరాఫ్ చంద్రబాబు మాత్రమే.వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అయితే చాలాసార్లు లోకేష్ గాలి తీసేశారు.

లోకేష్‌కు తాము ఏ విషయంలోనూ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, లోకేష్ జస్ట్ చంద్రబాబు పుత్ర రత్నమేనని, తామెందుకు జవాబు ఇవ్వాలంటూ పదునైన వ్యాఖ్యలతో గుండెల్లో కత్తులు దూసేశారు.

Telugu Andhra Pradesh, Chandrababu, Cm Jagan, Kakanigovardhan, Lokesh, Ysrcp-Tel

అంతేకాదు.లోకేష్‌కి జాకీలేసి పైకి లేపి హైప్ క్రియేట్ చేసినంత మాత్రాన, మేము అతడ్ని గుర్తించాలా? అంటూ మంత్రి కాకాణి కుండబద్దలు కొట్టారు.వ్యవసాయ రంగానికి సంబంధించి పలు సీఎం జగన్‌కు లోకేష్ రాసిన లేఖ గురించి ప్రస్తావిస్తూ.

అసలు అతనికి వ్యవసాయం గురించి ఏం తెలుసు? ఆయనేమైనా వ్యవసాయ రంగ నిపుణుడా? అంటూ గాలి తీసేశారు.తమ దృష్టిలో లోకేష్ కేవలం చంద్రబాబు తనయుడు మాత్రమేనని, అతను అడిగే ప్రశ్నలకు తాము ఎలాంటి సమాధానాలు ఇవ్వమని కాకాణి స్పష్టం చేసేశారు.

మిగిలిన మంత్రుల ధోరణి కూడా సరిగ్గా ఇలాగే ఉంది.లోకేష్ ప్రస్తావన వస్తే చాలు.

అతడో ‘పప్పు’ అంటూ సెటైర్లు వేసేస్తుంటారు.

Telugu Andhra Pradesh, Chandrababu, Cm Jagan, Kakanigovardhan, Lokesh, Ysrcp-Tel

చంద్రబాబు కొడుకు కాబట్టే లోకేష్‌కి మంత్రి పదవి దక్కిందని, ఈరోజు ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని దుయ్యబడుతున్నారు.అసలు ప్రత్యర్థుల దాకా ఎందుకు? ఇప్పటికీ చంద్రబాబు తన కొడుక్కి పార్టీ పగ్గాలు అప్పజెప్పడానికి సందేహిస్తున్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.లోకేష్ పరిస్థితి మరీ ఇంతలా ఉందంటే.

తండ్రిగా చంద్రబాబు చెందుతున్న ఆవేదనని అర్థం చేసుకోవచ్చు.రాజకీయ పరిణతిని చాటుకోవాల్సిన తరుణంలో.

లోకేష్ ఇంకా తడబడుతూ ఉండటమే.అతనికి శాపంగానూ, తండ్రి మెడకు ఉరితాడుగానూ మారినట్టు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube