ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు.ఇల్లు గెలవడంలో ఇప్పటికే రెండు సార్లు విజయవంతమైన కెసిఆర్( KCR ) రచ్చ గెలవడానికి పావులు కదుపుతున్నారు అయితే ఇప్పుడు ఇంటి పరిణామాలు వ్యతిరేకం గా మారడం ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందట … ఇంతకాలం ఏకచత్రాధిపత్యంతో పార్టీని నడిపిన కేసీఆర్ కు ఇప్పుడు పార్టీలో వినిపిస్తున్న అసంతృప్తి స్వరాలు కలవరానికి గురిచేస్తున్నాయట .
ఇంతకుముందు పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా కేసీఆర్ కు ఎదురు చెప్పడానికి ధైర్యం చేయని నేతలు ఇప్పుడు బహిరంగంగా మీడియా ముఖంగా పార్టీపై తమ అ సంతృప్తిని వ్యక్తం చేయడం గులాబీ పార్టీని ఇంతకుముందు ఎన్నడూ చూడని పరిస్థితి అని చెప్పవచ్చు .

గత రెండు ఎన్నికలలో తెలంగాణ వాదం( Telangana argument ) బలంగా ఉండటం తెలంగాణ తెచ్చిన ఘనత కేసిఆర్ కు ఉండడం తో పార్టీ బలంగా గెలవడం ప్రతిపక్ష టీడీపీ( TDP ) నామరూపాలు లేకుండా పోవడం, కాంగ్రెస్లోని కీలక నేతలను పార్టీలో చేర్చుకొని ఆ పార్టీని దాదాపు ఖాళీ చేయడంతో పార్టీలోని అసంతృప్తులకు ఆప్షన్ లేకుండా పోయింది అసలు తెలంగాణలో కొన్ని సంవత్సరాలు పాటు మోనోపాలి గా టిఆర్ఎస్ మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు.అయితే క్రమంగా భాజపా తెలంగాణలో బలపడడం.

పది సంవత్సరాల పరిపాలనతో ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెరగడంతో… కేసీఆర్ తో బాజాపా( Bajapa ) కెసిఆర్ తో డి అంటే డి అంటూ పోటీ పడడంతో బారసా లోని అసంతృప్తి వాదులకు బలం వచ్చినట్టుంది….కాంగ్రెస్ కూడా రేవంత్ రాకతో బలం పుంజుకోవడంతో ఇప్పుడు తెలంగాణలో ముక్కోణపు పోటీ పరిస్థితులు కనిపిస్తున్నాయి తద్వారా ఇంతకాలం పదవులు లేకపోయినా ప్రాముఖ్యత లేకపోయినా మౌనంగా సర్దుకున్న నేతలు ఇప్పుడు స్వరం పెంచుతున్నారు ఈ పార్టీ కాకపోతే మరొక పార్టీ అన్న పరిస్థితి ఉండడంతోతగ్గి ఉండాల్సిన అవసరం లేకపోవడంతో ఏకంగా అధినేతపైన గొంతు ఎత్తుతున్నారు .రచ్చ గెలవడం అటుంచి ఇంటి పరిస్థితులు అదుపు తప్పుతున్న వేళ రాజకీయ చాణక్యం బాగా తెలిసిన కేసీఆర్ పార్టీని ఎలా చక్కదిద్దుకుంటారో చూడాలి
.