టాలీవుడ్ జక్కన్న రాజమౌళి( Rajamouli ) ఆర్ ఆర్ ఆర్ చిత్రం తో ఆస్కార్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ రూపొంది రూ.1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేయడంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకున్న జక్కన్న హాలీవుడ్( Hollywood ) రేంజ్ గుర్తింపును సొంతం చేసుకున్నారు అనడంలో సందేహం లేదు.ఈ చిత్రానికి రాజమౌళి సొంతం చేసుకున్న దానితో పోలిస్తే రాబోయే సినిమాలకు రాజమౌళి సొంతం చేసుకోబోతున్నది ఎక్కువ అనడంలో సందేహం లేదు.
రాజమౌళి ఓకే అనాలి కాని హాలీవుడ్ ఫిలిం మేకర్స్ కూడా ఆయన తో వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.హాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఆయన తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
అలాంటి రాజమౌళి ఒక హాలీవుడ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హాలీవుడ్ లో రూపొందుతున్న ఒక సినిమా కోసం టెక్నికల్ సపోర్టు( Technical Support ) అందించేందుకు రాజమౌళి తో ఒప్పందాలు కుదుర్చుకున్నారట.ఇండియా లోనే ఉండి రాజమౌళి ఆ సినిమా యొక్క పనులను మానిటరింగ్ చేయబోతున్నాడు. గ్రాఫిక్స్ వర్క్ ఇతర విషయాలు అన్నీ కలిపి రాజమౌళి పర్యవేక్షణలో జరగబోతున్నాయి అంటూ సమాచారం అందుతుంది.
మొత్తానికి రాజమౌళి హాలీవుడ్ ప్రాజెక్టుకి భాగస్వామ్యం అవ్వబోతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్తులో రాజమౌళి నుండి హాలీవుడ్ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక మహేష్ బాబు( Mahesh Babu ) హీరో గా ఒక సినిమా ను రూపొందించేందుకు రాజమౌళి ఏర్పాట్లు చేస్తున్నాడు అందుకోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న త్రివిక్రమ్ సినిమా పూర్తి అయిన తర్వాత జక్కన్న సినిమా ను మొదలు పెట్టబోతున్నాడు.







