రాజకీయాల్లో ఇప్పుడు సినిమాటిక్ డైలాగులు మామూలు అయిపోయాయి.తొడగొట్టడాలు మీసం మెలెయ్యడాలు ఇప్పుడు నాయకత్వ లక్షణాలుగా వర్ధిల్లుతున్నాయి… ప్రజలు కూడా ఇలాంటి లక్షణాలనే ఆదరించడంతో ఇప్పుడు నాయకులు కూడా వాటికే ప్రాముఖ్యతను ఇస్తున్నారు విషయానికొస్తే ప్రతిపక్షాలపై మాస్ డైలాగులు పేల్చారు హోమ్ మంత్రి అమిత్ షా…( Home Minister Amit Shah ) అస్సాం లోని డిబ్రూగర్లో భాజపా కార్యాలయానికి శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో పాల్గొని మాట్లాడారు.

మీరు మోడీని( Pm Modi ) ఎంతగా విమర్శిస్తే బిజెపి ( BJP )ఎంతగా ఎదుగుతుందని ఆయన ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు … ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాలు కాంగ్రెస్కు కంచుకోటలా ఉండేవని అయితే ఇప్పుడు మోడీ మార్క్ అభివృద్ధితో ఆ రాష్ట్రాలన్నీ భాజపా వైపు చూస్తున్నాయని రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పాదయాత్ర చేసిన తర్వాత కూడా ఆ రాష్ట్రాల్లో భాజపా గెలవడం కాంగ్రెస్ యువరాజు నాయకత్వ బలం తెలుస్తుంది అంటూ ఎద్దేవా కచేశారు.దేశానికి సుపరిపాలన అందించడం మోడీ లక్ష్యం అని శాంతి బద్రతలు కాపాడటమే తమ ప్రబుత్వ కర్తవ్యం అని చెప్పుకొచ్చారు .కొంతమంది ప్రతిపక్షాలు మోడి కోసం సమాధులు తగ్గుతారట, మీరు సమాధులు తవ్వితే 100 కోట్ల మంది జనం ఆయన కోసం పూజలు చేస్తారంటూ ఆయన తెలిపారు…

విదేశాల్లో భారత ప్రజాస్వామ్యం పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ మీరు ఇలానే దేశం పరువు విదేశాల్లో తీస్తూ ఉంటే కాంగ్రెస్ మరింత పత్యనావస్థ కు చేరుకుంటుందని.వచ్చే సార్వత్రిక ఎన్నికలలో 300 సీట్లు గెలుచుకొని మరొకసారి అదికారం లోకి వచ్చేది బాజాపా ప్రబుత్వమేనని ఆయన ప్రతిపక్ష నేతలకు సవాలు చేశారు బారత్ ఒకప్పటిలా లేదని ఇప్పుడు మోడీ ప్రధాని అమిత్ షా హోమంత్రి గా ఉన్న భారత్ చాలా బలమైనదని తెలుసుకోవాలంటూ అరుణాచలం ముఖ్యమంత్రి పెమా ఖండూ వ్యాఖ్యానించారు ఆయన చైనా ను ఉద్దేశించి నర్మగర్బం గా ఈ వాఖ్యలు చేశారు ….చైనా సరిహద్దుకు అతి దగ్గరగా ఉన్న ప్రదేశంలో అమిత్ షా తో కలిసి పర్యటించిన ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.అమిత్ షా పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.







