టీఆర్ఎస్ పై బీజేపీ విమర్శలను ప్రజలు లైట్ తీసుకుంటున్నారా?

ప్రజల మెప్పు పొందాలని రాజకీయ పార్టీలు చేసే అతి వాళ్లకు చేటు చేస్తుందని చాలా విషయాల్లో రుజువైంది.

తెలంగాణలో ఏమాత్రం పట్టు లేని బీజేపీ నేడు కొంత బలపడినదని చెప్పుకోవచ్చు.

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ కుమ్ములాటలతో ప్రజాదరణను పొందలేకపోతోంది.ఇది గమనించి వ్యూహాత్మకంగా బీజేపీ వ్యూహాలకు పదును పెట్టి కాంగ్రెస్ ను వెనక్కి నెట్టింది.

అయితే టీఆర్ఎస్ ను ఏకధాటిగా విమర్శించడమే పనిగా పెట్టుకున్న బీజేపీ ఇక టీఆర్ఎస్ ను ప్రతి పనిలో విమర్శిస్తోంది.అయితే విమర్శలు సహేతుకంగా ఉంటే ప్రజలు నమ్ముతారు కాని, ప్రజలలో ఆ విషయం పట్ల వ్యతిరేకత లేకుంటే పార్టీలు ప్రజల ముందు నవ్వుల పాలవుతాయి.

సరిగ్గా ఇలాంటి పరిస్థితులలోనే ప్రస్తుతం బీజేపీ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రభుత్వంపై సభలు ఏర్పాటు చేసి మరీ విమర్శలు గుప్పిస్తుంటే ప్రజలు బీజేపీ వైపు చూడటం సరి కదా, టీఆర్ఎస్ పై సానుభూతి పెరిగిపోతోంది.

Advertisement

ఇదే ఇప్పుడు బీజేపీకి చేటు చేసేలా ఉంది.అయితే రోజు రోజుకు బీజేపీ విమర్శలను ప్రజలు లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఏవైతే బీజేపీ విమర్శలు గుప్పిస్తుందో వాటిని టీఆర్ఎస్ సరైన సమయంలో వాటిని నెరేవేర్చి ప్రజల మద్దతు చూరగొనే అవకాశం ఉంది.కాని బీజేపీ అతి విమర్శలు టీఆర్ఎస్ కు లాభం చేకూరే విధంగా ఉంటే బీజేపీ మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.

రారనుకున్నారు కానీ..  అసెంబ్లీ కి వచ్చేసిన కేసీఆర్ 
Advertisement

తాజా వార్తలు