నాగబాబు, శేఖర్ మాస్టర్‌లు నసగాళ్లా?.. ధనరాజ్ ఉద్దేశ్యం అదేనా?

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎంటర్టైన్మెంట్ షో ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఏదైనా ఈవెంట్స్ సందర్భంలో తాము చేసే సందడి అంతా ఇంతా కాదు.

 Are Nagababu And Shekhar Masters Nasagalla Is That What Dhanraj Intended, Nagaba-TeluguStop.com

నిత్యం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు.పైగా మంచి రేటింగ్ కూడా సంపాదించుకుంటారు.

ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారమవుతున్నాయి.

ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఛానల్స్ బుల్లితెర ప్రేక్షకులకు మంచి మజాను అందిస్తున్నాయి.

ఇక అందులో పాల్గొనే సెలబ్రెటీలు, ఆర్టిస్టులు, జడ్జీలు, యాంకర్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎంతో ఓపికతో ప్రేక్షకులను మెప్పించటానికి బాగా కష్ట పడుతూ ఉంటారు.

ఇక కొన్ని షోలలో కంటెస్టెంట్ లు తాము చేసే పర్ఫామెన్స్ కు జడ్జీల నుండి ఓటింగ్ కోసం ఎదురు చూడటం లాంటివి.

జడ్జీలు కూడా కంటెస్టెంట్ ల పర్ఫామెన్స్ కు ఫిదా అయి మార్కులు ఇవ్వడం లాంటివి చూస్తుంటాము.

ఇదంతా పక్కన పెడితే మామూలు సమయాలలో షోలలో జరిగే కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈవెంట్ సమయములలో కంటెస్టెంట్ లు వాటిని పర్ఫామెన్స్ చేసి చూపిస్తుంటారు.దీంతో ఆ సమయంలోనే ప్రేక్షకులకు షో లలో ఇలా జరుగుతుందా అని తెలుసుకుంటారు.

Telugu Stars Dhamaka, Dhanraj, Nagababu, Shekhar Master-Movie

అలా ఇప్పటికీ చాలా మంది ఆర్టిస్టులు తమ షో లో జరిగే సంఘటనలను, జడ్జీలు మాట్లాడే విషయాలను పర్ఫామెన్స్ చేసి చూపించారు.పైగా జడ్జీలను దృష్టిలో పెట్టుకొని కొన్ని డైలాగులు కూడా కొడుతూ ఉంటారు.అలా తాజాగా ధనరాజ్ కూడా నాగబాబు, శేఖర్ మాస్టర్ లను దృష్టిలో పెట్టుకొని సరదాగా ఒక స్కిట్ చేశాడు.

ప్రస్తుతం స్టార్ మా లో కామెడీ స్టార్స్ ధమాకా అనే ఎంటర్టైన్మెంట్ షో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో దీపిక పిల్లి యాంకర్ గా చేస్తూ బాగా సందడి చేస్తుంది.పైగా శేఖర్ మాస్టర్ జడ్జిగా చేస్తున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.అందులో ఈ షో కి తొలిసారిగా నాగబాబు ఎంట్రీ ఇచ్చాడు.

Telugu Stars Dhamaka, Dhanraj, Nagababu, Shekhar Master-Movie

ఇక నాగబాబు ఎంట్రీతో వేదిక మొత్తం సందడి సందడిగా మారింది.కమెడియన్స్ తమ పర్ఫార్మెన్స్ తో బాగా అదరగొట్టారు.మధ్య మధ్యలో నాగబాబు తన డైలాగ్స్ తో తెగ నవ్వించాడు.అందులో కమెడియన్ ధనరాజ్ ఒక స్కిట్ చేయగా అందులో ఎక్కువగా నాగబాబుని, శేఖర్ మాస్టర్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని డైలాగులు కొట్టాడు.

తమ పర్ఫామెన్స్ కి వాళ్ళు మాట్లాడే మాటలు అనేవి నస కాదని అవి వాళ్ల జడ్జిమెంట్ అని కాస్త కామెడీగా చెప్పటంతో అందరూ తెగ నవ్వుకున్నారు.దీంతో ఈ ప్రోమో ని చూసిన నెటిజన్లు ధన రాజ్ దృష్టిలో నాగబాబు, శేఖర్ మాస్టర్ నసగాళ్లా అంటూ ఆయన ఉద్దేశం అదేనా అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

మరికొందరు ఈ ప్రోగ్రాం కోసం వెయిటింగ్ అని కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube