పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో ఇటీవల నాటు సారా తాగి చాలా మంది మరణించిన సంగతి తెలిసిందే.దాదాపు 18 మంది నాటు సారా తాగడం వల్ల చనిపోవటంతో ప్రతిపక్ష పార్టీ టీడీపీ జంగారెడ్డిగూడెంలో ఆందోళనలు చేపడుతోంది.
ఏజెన్సీ ప్రాంతంలో ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకోవడంతో తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు… జంగారెడ్డిగూడెం ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో పర్యటన చేపడుతున్నారు.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు .ఇక ఇదే సమయంలో అధికార పార్టీ నేతలు అత్యుత్సాహం చూపిస్తున్నట్లు బాధిత కుటుంబాలను ఏలూరుకి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి.చంద్రబాబు పర్యటన నేపథ్యంలో… పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి పలు ఆంక్షలు విధించినట్లు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా బాబు పర్యటన క్రమంలో జంగారెడ్డిగూడెం రాకుండా చుట్టుప్రక్కల టీడీపీ నాయకులను మరియు కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నట్లూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇదే విషయంపై అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.







