విమర్శలు సరే చర్యలేవి? నిలదీసిన చంద్రబాబు!

ఎన్నికల సంవత్సర అయినందున ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాజకీయాల్లో నేతలు దూకుడు పెంచేశారు .

దాదాపు అన్నీ ప్రదాన పార్టీలు ప్రజల్లో వివిద కార్యక్రమాలతో దూసుకెళ్తున్నాయి .

తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) అయితే రాష్ట్రం నలుమూలలా ఫోకస్ చేసి సభలు సమావేశాలతో అదరగొడుతుంది .ఒకవైపు యువగళం పేరిట రాష్ట్రాన్ని చుట్టేస్తుంటే మరోపక్క మెరుపు సమావేశాలతో చంద్రబాబు దూసుకెళ్తున్నారు.కుప్పంలో మూడు రోజుల పర్యటన చేస్తున్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) అంత అవినీతి పరుడు దేశం మొత్తం మీద వెతికినా కనిపించడని సాక్షాత్తు దేశ హోం మంత్రే ఈ విషయం చెప్పారని ఆయన విమర్శించారు.విమర్శలు చేసినప్పుడు చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారంటూ ఆయన కేంద్ర బాజాపా ను కూడా ఆయన ప్రశ్నించారు .అధికారంలో ఉండి కూడా అవినీతిని ఎదుర్కోకపోతే ఎలా అంటూ ఆయన వ్యాఖ్యానించారు.దేశంలో 45 సంవత్సరాలు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న తనకే ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వని ముఖ్యమంత్రి ఈ తుగ్లక్ అంటూ ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను సమర్ధవంతంగా ఉపయోగించు కుని సంపదను సృష్టిస్తామని , పెరిగిన సంపదను ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తామని, ఆ సత్తా తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.మేనిఫెస్టో ( Manifesto )అమలకు కట్టుబడి ఉన్నామని ఎన్నికలకు ముందే అర్హులందరికీ టోకెన్లు కూడా ఇస్తామని ఆయన ప్రకటించారు .

Advertisement

రాష్ట్రాన్ని రౌడీల చేతుల్లో పెట్టారని, కుప్పంలో రౌడీ రాజకీయాలు నడుస్తున్నాయని అన్ని గమనిస్తూ, లెక్కపెడుతున్నామని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.ప్రజలు ఆలోచించి అవకాశం ఇవ్వాలని , ఒక్క అవకాశం అన్నారని ఇస్తే ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని రాష్ట్రాన్ని మళ్లీ తిరిగి అభివృద్ధి పథంలోకి నడిపించే సమర్థత తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు