ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో సంక్రాంతి పండుగ.చాలా ఘనంగా నిర్వహిస్తారు.
మూడు రోజులు జరిగే ఈ పండుగకు కోళ్ల పందాలతో పాటు పిండివంటలతో.ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకుంటారు.
ముఖ్యంగా గోదావరి జిల్లాలలో సంక్రాంతి( Sankranti ) హడావిడి బీభత్సంగా ఉంటుంది.కోడిపందాలు మొదలుకొని ఇంకా రకరకాల ఆటలు వినోదాల కార్యక్రమాలు గోదావరి జిల్లాలలో నిర్వహిస్తుంటారు.
తెలుగు పండుగలలో సంక్రాంతి అతిపెద్ద పండుగ.ఈ పండుగకు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుండి పక్కనే ఉండే తెలంగాణ నుండి ఆంధ్రాకి భారీ ఎత్తున జనాలు వస్తుంటారు.
మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ స్టార్ట్ కానుంది.జనవరి 14 నుండి మూడు రోజులపాటు జరిగే ఈ పండుగకు.వచ్చేవారం వీకెండ్ నుండి సందడి మొదలుకానుంది.దీంతో టోల్ గేట్ ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి నెలకొంటుంది.కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ( APSRTC ) శుభవార్త తెలియజేసింది.సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.
మొత్తం 6795 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు పేర్కొంది.ఈ స్పెషల్ బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ తెలియజేసింది.
ఈనెల 6 నుంచి 18 వరకు ఈ స్పెషల్ బస్సులు నడవనున్నాయి.రానుపోను ఒకేసారి టికెట్లు బుక్ చేసుకునే వారికి పది శాతం రాయితీ ఇస్తున్నట్లు కూడా ఏపీఎస్ఆర్టీసీ తెలియజేయడం జరిగింది.