APPSC Group-1 Mains : గ్రూప్-1 మెయిన్స్ రద్దును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ అప్పీల్..!

2018 నాటి గ్రూప్ -1 మెయిన్స్( Group-1 Mains ) పరీక్షను రద్దు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించాయి.

ఈ మేరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తూ అప్పీల్ చేశాయి.

కాగా ఏపీ పీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పై రేపు విచారణ జరగనుంది.అయితే 2018 గ్రూప్ -1 పరీక్షా పేపర్ల వాల్యుయేషన్ లో పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

డిజిటల్ ఎవాల్యుయేషన్ తరువాత రెండుసార్లు మూల్యాంకనం చేశారని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టు( AP high court )ను ఆశ్రయించారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ఒకటి కంటే ఎక్కువ సార్లు మూల్యాంకనం చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంది.ఈ క్రమంలోనే గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఆరు నెలల్లో పరీక్షను నిర్వహించాలని కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి
Advertisement

తాజా వార్తలు