ఉద్యోగానికి వెళ్లాలంటే ఫస్ట్ కావాల్సింది రెజ్యూమ్.జాబ్ సెర్చింగ్ లో ఉన్నప్పుడు రెజ్యూమ్ ఎంత బాగుంటే అవకాశాలు అంతలా పెరుగుతాయి.
అందుకే రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.అందులో పొందుపరిచే అంశాలను ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టాలి.
రెజ్యూమ్ లో తప్పనిసరిగా ఉండాల్సిన అంశాలు కూడా ఉంటాయి.మరి ఆ అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు పేరు, కాంటాక్ట్ వివరాలు, విద్యార్హతలు, అనుభవం, స్కిల్స్, విజయాలు, స్కాలర్ షిప్స్, సర్టిఫికేషన్స్ ఇలా ఆర్డర్ లో ఉండాలి.రెజ్యూమ్ అనేది చాలా సింపుల్ గా ఉండాలి.
ఎక్కువగా అలంకరణ చేయకూడదు.రెజ్యూమ్ లో మీ పూర్తి పేరు రాయండి.
నిక్ నేమ్స్ రాయొద్దు.కాంటాక్ట్ డీటెయిల్స్ లో మీ అడ్రస్ తో పాటు ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి.
అయితే మీ పాస్ పోర్ట నెంబర్ మాత్రం అస్సలు ఎటువంటి పరిస్థితిలో పెట్టొద్దు.ఇక ఆబ్జక్టివ్ లేదా గోల్స్ ని ఇంటర్వ్యూయర్లు దాదాపుగా చదవరు.
అలా అని అసాధారణ అంశాలు రాయకూడదు.విద్యార్హతల్లో మీ హైస్కూల్ నుంచి మీకు ఉన్న హైయ్యర్ ఎడ్యుకేషన్ వివరాలు అన్ని ఉండాలి.

ఇక కంపెనీ లేదా ప్రాజెక్ట్ ఎక్స్ పీరియన్స్ ని విభిన్న మార్గంలో చూపించే ప్రయత్నం చేయండి.రెజ్యూమ్ లో మీ అనుభవాలు అవసరమైనవి మాత్రమే రాయండి.మీకు ఉన్న అన్ని అనుభవాలు రాసి పేజీలు నింపకండి.ఇంటర్వ్యూ చేసే వారికి అంత సమయం ఉండదు కాబట్టి.మీరు అనుకున్నది వారి కంటపడాలి అంటే ఏం రాస్తే బాగుంటుందని ఆలోచించి రాయండి.మీరు అప్లయి చేసే రోల్ బట్టి విడి విడిగా రెజ్యూమ్ తయారు చేసుకోండి.
మీరు పని చేసిన సంస్థల, క్లయింట్ల పేర్లు, కాన్ఫిడెన్సియల్ సమాచారం మీ ప్రాజెక్టులో రాయవద్దు.మంచి, బలమైన పదాలను ఉపయోగించండి.
గతంలో పనిచేసిన చోట మీ విజయాలను వివరించండి.మీ నైపుణ్యాలు, అనుభవం ఆ కంపెనీకి ఎలా ఉపయోగపడిందో చెప్పండి.