ప్రపంచ వ్యాప్తంగా యాపిల్( Apple ) ఉత్పత్తులకు వున్న క్రేజ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇతర స్మార్ట్ యాక్ససరీస్ వాడకం పెరిగాక ఈ ఉత్పత్తులను తయారు చేయడానికి మార్కెట్లో ఎన్ని రకాల కంపెనీలు ఉన్నప్పటికీ ముఖ్యంగా యాపిల్ కంపెనీ ఈ ఉత్పత్తులను ప్రీమియం క్వాలిటీతో అందిస్తూ వినియోగదారుల మనసులను చూరగొంటోంది.
అయితే యాపిల్ ఉత్పత్తుల ఇతర కంపెనీలతో పోలిస్తే ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.అందుకే వాటిని అందరూ వాడే పరిస్థితి ఉండదు.

అయితే యాపిల్ ఉత్పత్తులపై సీజనల్ డీల్‌లు, డిస్కౌంట్‌లు అప్పుడప్పుడు నడుస్తూ ఉంటాయి.అలాంటప్పుడు కొంతమంది ఆపిల్ ప్రియులు తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తూ వుంటారు.ఈ క్రమంలోనే ఆపిల్ ఓ డిస్కౌంట్ సేల్ తీసుకువచ్చింది.అదే స్టూడెంట్ డిస్కౌంట్.యాపిల్ స్కూడెంట్ డిస్కౌంట్ పొందడానికి ముందుగా స్టూడెంట్స్ యాపిల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌కి( Apple Education website ) వెళ్లాలి.అక్కడ యూనిడేస్ ( Unidays )ద్వారా ధ్రువీకరించుకోవాలి.
తరువాత మీ అర్హతను ధృవీకరించ వలసి ఉంటుంది.ఈ క్రమంలో విద్యార్థి ఐడీ లేదా పాఠశాల ఈ మెయిల్, చిరునామాను నమోదు చేయాలి.
విద్యార్థి అయితే, మీ విద్యార్థి ఐడీ లేదా పాఠశాల ట్రాన్స్క్రిప్ట్ కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.అదే ఉపాధ్యాయులైతే మీ టీచింగ్ సర్టిఫికేట్ కాపీని అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది.

ఇక్కడ గుర్తుంచుకోవలసిన ఇతర విషయాలు కూడా వున్నాయి.ఇక్కడ ఆపిల్ ఉత్పత్తులపై ( Apple products )తగ్గింపు ధరలు కాలక్రమేణా మారవచ్చు.కాబట్టి తాజా సమాచారం కోసం అధికారిక యాపిల్ ఎడ్యుకేషన్ స్టోర్ వెబ్‌సైట్‌ని ఎల్లప్పుడూ తనిఖీ చేయడం ఉత్తమం.ప్రస్తుతం మాత్రం భారతదేశంలో కొత్తగా ఆమోదించబడిన విశ్వవిద్యాలయ విద్యార్థులకు, అలాగే అన్ని స్థాయిలలోని ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆపిల్ అవకాశం కల్పిస్తోంది.
మీరు అర్హత పొందాలంటే తప్పనిసరిగా 16 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి.ఇక్కడ మ్యాక్ కంప్యూటర్లు,ప్యాడ్‌లు, ఇతర యాపిల్ ఉత్పత్తులపై 10% శాతం నుండి 15 శాతం వరకు ఆదా చేయవచ్చు.







