అప్పట్లో ఒకడుండేవాడు మూవీ రివ్యూ

చిత్రం : అప్పట్లో ఒకడుండేవాడు

బ్యానర్ : అరన్ మీడియా వర్క్స్ దర్శకత్వం : సాగర్ కే చంద్ర నిర్మాత : ప్రశాంతొ, కృష్ణ విజయ్ సంగీతం : సాయి కార్తిక్ విడుదల తేది : డిసెంబర్ 30, 2016 నటీనటులు : నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్య హోపే కథలోకి వెళ్తే : 1990 ల్లో, హైదరాబాదులో జరిగే కథ ఇది.

ఇమ్తియాజ్ అలీ (రోహిత్) ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్టు.

నక్సలైట్ల మూలాన, తన తల్లిదండ్రులను కోల్పోవడంతో, ఇతను నక్సలైట్లపై పగని పెంచుకుంటాడు.నక్సలైట్లని ఏరిపారేయాలని కంకణం కట్టుకుంటాడు.

మరోవైపు రాజుకి (శ్రీ విష్ణు) క్రికేట్ అన్నా, తన ప్రేయసి నిత్య (తాన్య హోపే) అన్న పిచ్చి ప్రేమ.స్థిరపడి తన ప్రేయసిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు.

అనుకోని పరిస్థితుల్లో ఒక లోకల్ రౌడి భగవాన్ దాస్ ని హత్య చేస్తాడు రాజు.దురదృష్టవశాత్తు, రాజు అక్క నక్సలైట్ కావడం వలన, రాజు కూడా అదే పద్ధతిలో వెళుతున్నాడనే అపోహలో, ఇమ్తియాజ్ కి టార్గేట్ గా మారి, సర్వం కోల్పోతాడు రాజు.

Advertisement

ఆ తరువాత, రాజు ఇమ్తియాజ్ మీద పగ తీర్చుకున్నాడా లేదా అనే విషయం తెర మీద చూడాల్సిందే.నటీనటుల నటన : రోహిత్ సినిమాలు అపజయాన్ని చూడవచ్చు కాని, రోహిత్ మాత్రం నటుడిగా అపజయాన్ని చూడలేదు.తనకు మాత్రమే సాధ్యపడే డైలాగ్ డెలివరి, బేస్ వాయిస్ తో ఇమ్తియాజ్ పాత్రని బాగా రక్తి కట్టించాడు రోహిత్.

జనాలకు పెద్దగా తెలియని శ్రీవిష్ణుతో ఈగోకి పోకుండా, కథను నమ్ముకోని, కథలో పాత్రగా కనబడటం అభినందించదగ్గ విషయం.శ్రీవిష్ణు అభినయం కూడా ఆకట్టుకుంటుంది.తన భావోద్వేగాలకి కనెక్టు అవుతారు ప్రేక్షకులు.

బ్రహ్మజీ పాత్ర బాగుంది.ఉన్నంత సేపులో రాజీవ్ కనకాల మెరిసాడు.

హీరోయిన్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదు.సాంకేతిక వర్గం పనితీరు : నేపథ్యం సంగీతం చాలా బాగున్నా, సాయి కార్తిక్ బాణీలు అంతగా ఆకట్టుకోవు.నిర్మాణ విలువలు అంతంతమాత్రమే.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
2025 లో మన స్టార్ హీరోలు బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నారా..?

ఆ ప్రభావం సినిమాటోగ్రాఫి మీద కూడా కనబడుతుంది.ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉండాల్సింది.

Advertisement

అక్కడక్కడ అవసరానికి మించి స్లో అయిపోతుంది.ఇలాంటి కథకు డిఐ వర్క్ చాలా అద్భుతంగా ఉండాలి.

అది లేదు.విశ్లేషణ : కథ, కథనం, డైరెక్షన్ .సాగర్ కే చంద్ర కొత్రవాడైనా డైరెక్టర్ గా మంచి ముద్ర వేసేసాడు.మొదటి సినిమాకే ఇంత రిస్కి సబ్జెక్టు ఎంచుకోని, దాన్ని కన్విన్సింగ్ గా తీయడం మామూలు విషయం కాదు.

ఒకవైపు ఇంటెన్స్ గా కనబడే ఇమ్తియాజ్, మరోవైపు తన తప్పు లేకుండా సర్వం పోగొట్టుకున్న రాజు, రెండు పాత్రలతో దర్శకుడు కథనాన్ని నడిపించిన తీరు, పలికించిన భావోద్వేగాలు, ఓ వర్గం ప్రేక్షకులని విపరీతంగా అలరిస్తాయి.రాసుకున్న మాటలు ఈ స్క్రీన్ ప్లే అదనపు బలాన్ని అందిస్తాయి.

అయితే క్లయిమాక్స్ కి ముందు సినిమా ల్యాగ్ అవడం, అవసరం లేని పాటలే మైనస్ పాయంట్స్ గా చెప్పుకోవచ్చు.కాని చాలా బాగా వచ్చిన క్లయిమాక్స్, కొత్తరకం సినిమాలు కోరుకునే ప్రేక్షకులలో మెదడులో బలంగా నాటుకుపోతుంది.

దాంతో తృప్తిగా హాలు నుంచి బయటకి వెళతాడు ప్రేక్షకుడు.అన్నివర్గాల సంగతేమో కాని, రోటీన్ సినిమాల మధ్యలో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకి మాత్రం బాగా నచ్చే సినిమా ఇది.ప్లస్ పాయింట్స్ : * ఆసక్తికరమైన కథ, కథనం * నారా రోహిత్, విష్ణు పెర్ఫార్మెన్స్ * సుత్తి లేని సంభాషణలు, భావోద్వేగాలు * క్లయిమాక్స్ మైనస్ పాయింట్స్ : * అక్కడక్కడ పేస్ తగ్గే నరేషన్ * పాటలు చివరగా : ఇప్పట్లో ఓ కొత్తరకమైన మంచి ప్రయత్నం ఈ సినిమా.

తెలుగుస్టాప్ రేటింగ్ : 3.25/5

తాజా వార్తలు