ప్రవాసుల కోసం 'APNRT' విస్తృత సేవలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ప్రవాసుల కోసం ఏర్పాటు చేయబడిన APNRT ఎన్నో పధకాలని రూపొందించి ఎంతో మంది ఎన్నారైలకి ఆసరాగా నిలుస్తోంది.అయితే ఈ క్రమంలోనే విదేశాలలో మనరించే ఎన్నారైలకి ఏపీ APNRT ద్వారా 50 వేల ఎక్స్ గ్రేషియా ఇచ్చేలా సరికొత్త పధకం రూపొందించింది.

ఈ మైగ్రేషన్ పాలసీ ప్రకారం, ప్రవాసాంధ్రులు ఎవరైనా విదేశాలలో మరణిస్తే ఆ వ్యక్తి కుటుంభానికి ఆర్ధిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ పధకాన్ని ప్రవేశ పెట్టారు.అంతేకాదు విదేశాలనుండి మృతదేహం తరలింపుకు ఒక లక్ష రూపాయల వరకు సంబంధిత వ్యక్తులు పెట్టిన ఖర్చులను సైతం మళ్ళీ ఇచ్చేలా రీయిమ్బర్స్మేంట్ కూడా APNRT ఇస్తుందని తెలిపారు.అయితే ఈ పధకం కేవలం ప్రభుత్వం ద్వారా సాయం పొందిన వారికి మాత్రమే వర్తిస్తుంది తప్ప కంపెనీ స్పాన్సర్ లేదా ఇండియన్ ఎంబసీ లేదా ఇండియన్ హై కమిషన్ లేదా సోషల్ వర్కర్, ఎన్.జి.ఓ నుండి ఆర్ధికసాయం అందించితే మాత్రం ఇది వర్తించదు.అంతేకాదు ఒక వేళ ఎన్నారైలు విదేశాలలో ఆసుపత్రి పాలై, ఉద్యోగం కోల్పోయినా సరే వారికి డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే ఒక లక్ష రూపాయల వరకు రీయంబెర్స్మెంట్ అందిస్తుంది.

అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.??

ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి కో-ఆర్డినేటర్ల ద్వారా , భాధిత కుటుంబ సభ్యులు ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి ఆఫీసుకు వచ్చి సోషల్ వర్కర్స్ , ఎన్‌ జి‌ ఓ ల సంప్రదించవచ్చు.అయితే ఏపీ కి చెందిన వారు మాత్రమె అర్హులు, వ్యక్తి మరణిస్తే ఒక సంవత్సరం లోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఎలాంటి ప్రతులు తీసుకోవాలంటే.

1 .మృతి చెందింతే :

- నామినీ లబ్దిదారుని యొక్క గుర్తింపు కార్డు - రేషన్ కార్డు, ఆధార్ కార్డు వైద్య సర్టిఫికెట్లు - ఇండియన్ ఎంబసీ/ఇండియన్ హై కమిషన్ జారీ చేసిన మరణ ధృవపత్రాలు (స్వదేశంలో చనిపోయినట్లయితే మరణ ధృవీకరణ పత్రం తో పాటు ఆ సమయానికి NRT అని నిరూపించే ధ్రువ పత్రం / వీసా కాపీ) రద్దు చేయబడ్డ పాస్పోర్ట్ ఫ్యామిలి మెంబర్ సర్టిఫికేట్

2 .ఫైనాన్షియల్ విషయంలో

గుర్తింపు కార్డు - రేషన్ కార్డు / ఆధార్ కార్డు / పాస్పోర్ట్ వైద్య సర్టిఫికెట్లు అనారోగ్య కారణం గా ఆ యా యాజమాన్యం ఉద్యోగ ఒప్పందం రద్దు చేసినట్లు నిర్ధారించే డాక్యుమెంట్లుతప్పకుండా తీసుకోవాలి.

జాక్ పాట్ కొట్టిన మేస్త్రి.. నెలకు కోటి చొప్పున 30 ఏళ్ల వరకు..

Advertisement

Advertisement

తాజా వార్తలు