అదేంటో గానీ ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఈ మధ్య వరుస షాక్‌లు తగులుతున్నాయి.ఆయన ఏ పనిచేసినా కొంచెం బెడిసికొడుతోందనే చెప్పాలి.
మొన్నటి వరకు ఎంపీ రఘురామ వ్యవహారం అటుంచితే ఇప్పడు జాబ్ క్యాలెండర్ పెద్ద దుమారమే రేపుతోంది.నిఉద్యోగులు జాబ్ క్యాలెండర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అసలు ఈ జాబ్క్యాలెండర్కు జగన్ చెప్పిన మాటలకు ఏమైనా సంబంధం ఉందా అంటూ మండిపడుతున్నారు.
రీసెంట్ గా సీఎం జగన్ మోహన్‌రెడ్డి విడుదల చేసిన ఈ ఆర్థిక సంవత్సారానికి చెందిన జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని వాటి సంఖ్యను కూడా అందులో తెలిపింది ప్రభుత్వం.
అయితే ఇందులో తెలిపిన ఉద్యోగాల సంఖ్యనే ఇప్పుడ పెద్ద ఎత్తున వ్యతిరేకతకు దారి తీసింది.అసలు జగన్ చెప్పిన లెక్కలకు అందులో పొందుపరిచిన లెక్కలకు ఏమైనా సంబంధం ఉందా అంటూ మండిపడుతున్నారు నిరుద్యోగులు.
అంతటితో ఆగకుండా చాలా జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఈ ఇదే జాబ్ క్యాలెండర్లో చెప్పిన ఉ్యదోగాల సంఖ్యపై తూర్పుగోదావరి జిల్లా లోని కాకినాడలో గల నిరుద్యోగ యువత నిరసన తెలిపారు.

పెద్ద ఎత్తున జగన్‌కు వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు.అంతే కాదు కర్నూలుకు చెందిన ఓ నిరుద్యోగి ఏకంగా సీఎం వైఎస్ జగన్ తోపాటు, రాష్ట్ర హోం మినిస్టర్ సుచరితలపై కంప్లయింట్ చేశారు.వారిని కర్నూలు కలెక్టరరేట్కు పిలిపించాలని అందులో కోరాడు.అయితే జగన్ 2019లో నిరుద్యోగులకు హామీ ఇస్తూ 6,500 పోలీసు ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడేమో జాబ్ క్యాలెండర్లో కేవలం 450 పోస్టులే భర్తీ చేస్తున్నట్టు తెలిపి మోసం చేశాడని సదరు నిరుద్యోగి వివరించాడు.
అలాగే 2020లో 6,300 జాబ్‌లు వేస్తామని డిప్యూటీ సీఎం సుచరిత కూడా మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు.అయితే జగన్ నిరుద్యోగులను ఆకట్టుకోవడానికి వేసిన జాబ్ క్యాలెండర్ చివరకు వ్యతిరేకతకు దారి తీస్తోంది.