అమరావతి ఎఫెక్ట్ : ఈ ప్రత్యర్థులంతా ఒక్కటవ్వబోతున్నారా ?

ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ అమరావతి కేంద్రంగానే తిరుగుతున్నాయి.

రాజధాని అమరావతి నుంచి మరో చోటుకి మారుస్తున్నారనే సంకేతాలతో అన్ని పార్టీలు ఇప్పుడు ఇదే అజెండాతో ముందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తున్నాయి.

బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు రాజధాని విషయంలో యాక్టివ్ గా ఉండడంతో రానున్న రోజుల్లో ఈ మూడు పార్టీలు కలిసి వైసీపీ ప్రభుత్వం పై కలిసికట్టుగా ముందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్టుగా రాజకీయ సమీకరణాలు కనిపిస్తున్నాయి.రాజధాని పై ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదనే ఆలోచనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ పోరాటంలో తమకు కలిసివచ్చే అన్ని పార్టీలతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు.

ప్రభుత్వం ఒక వైపు మిగతా పార్టీలన్నీ ఒకవైపు అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది.గతంలో రాజధానిని తీవ్రంగా విమర్శించిన బీజేపీ, జనసేన పార్టీలు కూడా ఇప్పుడు టీడీపీ తో కలిసి ముందుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి.

గతంలో అమరావతిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ఇప్పుడు మాత్రం అమరావతిలోనే నిర్మాణాలు కొనసాగించాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు.గతంలో అమరావతికి అంత భూమి ఎందుకు అంటూ అప్పటి టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టిన పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు టీడీపీకి మద్దతుగా రాజధాని విషయంలో స్పందిస్తున్నారు.ఇప్పుడు రాజధాని రైతుల కోసం అంటూ వైసీపీ మినహా మిగతా అన్ని పార్టీలు గొంతెత్తుతున్నాయి.

Advertisement

అసలు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసే విషయంలో టీడీపీ దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళింది.దీంతో రాజధాని రైతులు టీడీపీకి మద్దతుగానే ఉన్నారు.అయితే ఈ విషయంలో బీజేపీ, జనసేన పార్టీలు అప్పట్లో రాజధానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేశాయి.

అందుకే ఇప్పడు రాజధాని రైతులు తమకు అన్యాయం జరగకుండా చూడాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను కలిశారు.

ఈ నేపథ్యంలో అమరావతిని మార్చడానికి వీల్లేదని ఆయన ప్రకటనలు చేశారు.రైతులకు అన్యాయం చేయవద్దని చెల్లించాల్సిన కౌలును వెంటనే చెల్లించాలంటూ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.సుజనా చౌదరి, సునీల్ ధియోధర్, కన్నా లక్ష్మినారాయణ రాజధాని గ్రామాల్లో పర్యటనలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇక పవన్ విషయానికి వస్తే గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధానికి భూములు ఇవ్వడానికి ఇష్టపడని వారికి మద్దతుగా పోరాటం చేశారు.అంతే కాదు రాజధానిలో అనేక సార్లు పర్యటనలు కూడా చేశారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇవ్వని వారు చేసిన ఆందోళనలో పవన్ భాగమయ్యారు.అంతే కాదు రాజధానికి అంత భూమి ఎందుకంటూ విమర్శలు కూడా చేశారు.

Advertisement

ఇప్పుడు అమరావతి విషయంలో వీరంతా ఒక్కటే రాగం వినిపిస్తుండడంతో వీరంతా ఒకే వేదికపై వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది.ఇదే చొరవతో ముందు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు