రెండు గ్రామాల మధ్య స్మశానం గొడవ.. ఊరు మధ్యలో శవాన్ని వదిలేసారు!

ప్రస్తుతం ఆరడుగుల స్థలం కూడా దొరకనంత గా మారింది.

ఉన్నన్ని రోజులు అన్ని సదుపాయాలతో బతికి తీరా చనిపోయాక ఆరడుగుల గొయ్యి కోసం ఎన్నో పాట్లు పడుతుంటారు.

ఇక ఇప్పుడు ఖాళీ స్థలం దొరికిన కబ్జా చేసేస్తున్నారు.చివరికి ఊరి చివర్లో కూడా స్మశాన వాటిక దగ్గరగా ఉన్న స్థలాలను కొన్ని మరీ ఇళ్లను కట్టుకుంటున్నారు.

దీంతో స్మశానవాటిక స్థలం అనేది దొరకకుండా చేస్తున్నారు.చనిపోయిన వారి శరీరాలను పూడ్చడానికి కూడా స్థలం లేకుండా చేస్తున్నారు.

దీంతో ఓ రెండు గ్రామాల మధ్య స్మశాన విషయంలో గొడవ జరగగా ఓ శవాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిన ఘటన చోటు చేసుకుంది.శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరుగూడ లో నివాసమున్న రాయవలస మహాలక్ష్మి అనే మహిళ.

Advertisement

ఈమె వయసు 65 ఏళ్లు.ఫిబ్రవరి 18 గురువారం రోజున ఆమె అనారోగ్యంతో మృతి చెందింది.

దీంతో తమ కుటుంబ సభ్యులంతా కలిసి ఆమెకు అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు.దీంతో ఆమె మృతదేహాన్ని మెట్టూరు బిట్-3 నిర్వాసిత కాలనీలో ఉన్న స్మశాన వాటిక దగ్గరకు తీసుకువచ్చారు.

దీంతో ఆ చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయని, అక్కడ అంత్యక్రియలు జరపకూడదని ఆ గ్రామస్తులు అడ్డుపడ్డారు.ఇక రెండు గ్రామాల మధ్య మాట మాట ఏర్పడి గొడవ కాస్త పెద్దగా మారింది.

ఇక్కడ అ వివాదంలో ఆ వృద్ధురాలి మృతదేహం చిక్కుకుపోగా చివరకు ఆ వృద్ధురాలి అంత్యక్రియలు కాకుండా ఆగిపోయింది.దీంతో ఆ రెండు గ్రామాల మధ్య గొడవ కాస్త తీవ్రంగా మారడంతో.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఆ వృద్ధురాలి మృతదేహాన్ని ఊరి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు.ఆఖరికి ఆ వృద్ధురాలు తన శరీరంను పూడ్చి పెట్టడానికి కూడా నోచుకోకుండా పోయింది.

Advertisement

తాజా వార్తలు