ఏపీ సచివాలయంలో మరోసారి కరోనా పంజా...

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా మరోసారి ఏపీ సెక్రటేరియట్ లో కరోనా పంజా విసిరింది.

ఏకంగా అక్కడ పనిచేసే 14 మంది ఉద్యోగులు ఈ మహమ్మారి బారిన పడినట్లు తెలుస్తుంది.ఇప్పటికే గతంలో ఏపీ సచివాలయంలోనే భారీ గా కరోనా కేసులు నమోదు కాగా,ఇప్పడు తాజాగా మరోసారి 14 మంది ఈ మహమ్మారి బారిన పడడం తో అక్కడ పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వారిని ఆసుపత్రికి తరలించగా వారితో కాంటాక్ట్ లో ఉన్న వారందరిని టెస్ట్ లు చేయించుకోవాల్సింది గా వైద్యాధికారులు సూచిస్తున్నారు.కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం తో సచివాలయాన్ని శానిటైజ్ చేస్తున్నారు.

ఇంకోవైపు, రాష్ట్రంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు.రోజు రోజుకు అక్కడ కేసులు మరింత పెరిగిపోతున్నాయి.

Advertisement

ప్రతి రోజు దాదాపు 10 వేల కొత్త కేసులు నమోదవుతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 3 వేలకు పైగా మృతుల సంఖ్య నమోదు అయ్యింది.దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.30 లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 60 వేలకు చేరువలో మృతులు చోటుచేసుకున్నాయి.

సురేష్ ప్రొడక్షన్ మూవీలను రిలీజ్‌కి ఒక రోజు ముందే థియేటర్లలో వేస్తారట..??
Advertisement

తాజా వార్తలు