ఏపీ సచివాలయంలో మరోసారి కరోనా పంజా...

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా మరోసారి ఏపీ సెక్రటేరియట్ లో కరోనా పంజా విసిరింది.

 14 Emloyees Of Ap Secretariat Tests With Corona Positive Ap Secretariat, Corona-TeluguStop.com

ఏకంగా అక్కడ పనిచేసే 14 మంది ఉద్యోగులు ఈ మహమ్మారి బారిన పడినట్లు తెలుస్తుంది.ఇప్పటికే గతంలో ఏపీ సచివాలయంలోనే భారీ గా కరోనా కేసులు నమోదు కాగా,ఇప్పడు తాజాగా మరోసారి 14 మంది ఈ మహమ్మారి బారిన పడడం తో అక్కడ పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వారిని ఆసుపత్రికి తరలించగా వారితో కాంటాక్ట్ లో ఉన్న వారందరిని టెస్ట్ లు చేయించుకోవాల్సింది గా వైద్యాధికారులు సూచిస్తున్నారు.కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం తో సచివాలయాన్ని శానిటైజ్ చేస్తున్నారు.

ఇంకోవైపు, రాష్ట్రంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు.రోజు రోజుకు అక్కడ కేసులు మరింత పెరిగిపోతున్నాయి.

ప్రతి రోజు దాదాపు 10 వేల కొత్త కేసులు నమోదవుతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 3 వేలకు పైగా మృతుల సంఖ్య నమోదు అయ్యింది.దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.30 లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 60 వేలకు చేరువలో మృతులు చోటుచేసుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube