ఏపీలో వాలంటీర్లకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచింది.రాష్ట్రంలోని వాలంటీర్లపై, వాలంటీర్ వ్యవస్థపై విపక్ష పార్టీలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఎప్పుడూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేనలు ఎప్పటికప్పుడు మాటలతో దాడులు చేస్తూనే ఉంటారు.అలాగే తాజాగా వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు పాల్పడతారంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
అయితే ఈ వ్యవహారంపై మంత్రులు స్పందించినప్పటికీ… సీఎం జగన్ ఎందుకు స్పందించలేదని కొందరు వైసీపీ అభిమానులలో ప్రశ్నలు మెదిలాయి.కాగా ఈ అనుమానాలకు, ప్రశ్నలకు సీఎం జగన్ చెక్ పెట్టారు.
నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదు.సమయం వచ్చినప్పుడు ఏ విషయంపై అయినా స్పందించాలంటే ఇదేనేమో.
వెంకటగిరి పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రతి ఒక్కరికీ ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందిస్తున్న వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి సంస్కారం లేదంటూ మండిపడ్డారు.
నిజానికి సీఎం జగన్ గత కొంతకాలంగా విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతున్నారు.కానీ తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో జరిగిన సభలో ఆ విమర్శల పదును కాస్త పెరిగింది.
దానికి కారణం గత కొన్నిరోజులుగా వాలంటీర్లపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వంగలపూడి అనిత వంటి నేతలు చేసిన నీచపు వ్యాఖ్యలని పలువురు అంటున్నారు.గత నాలుగేళ్లుగా నిస్వార్థంగా పేదల కోసం వాలంటీర్లు పనిచేస్తున్నా.
సంస్కారహీనంగా కామెంట్స్ చేయడం సీఎం జగన్‌కి కోపం తెప్పించింది.మంచి చేస్తున్న వారిని తిట్టడం సంస్కారం అనిపించుకోదు అంటూ చురకలు అంటించారు.
అంతేకాదు.వాలంటీర్లకి తాను అండగా ఉంటానని కూడా చాటిచెప్పారు.
బహిరంగ వేదికపై మాట్లాడుతూ అమ్మాయిలను తప్పుడు దృష్టితో చూసేవాళ్లు, అమ్మాయిలతో కలిసి మందుతాగి స్విమ్మింగ్ ఫూల్ లో అసభ్యంగా ఫోజులు ఇచ్చేవాళ్లు, మళ్లీ మళ్లీ పెళ్లిళ్లు చేసుకుంటూ ఆడబిడ్డలకు ద్రోహం చేసేవాళ్లు ఇప్పుడు వాలంటీర్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అసలు అర్హతే లేని వాళ్లు ఒక వ్యవస్థపై కామెంట్స్ చేయడం ఏంటని మండిపడుతున్నారు.
అయితే వాలంటీర్లపై విమర్శలు పక్కా ప్లాన్‌తో చేస్తున్నారని ప్రజలకి సీఎం జగన్ వివరించే ప్రయత్నం చేశారు.చంద్రబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని.
ఆ క్రమంలోనే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు.అయితే.
ఇక్కడ ప్రజలు గుర్తించాల్సింది.వాలంటీర్లు ఎవరో కాదు.
మన గ్రామంలోని పిల్లలే.మన ఊరి బిడ్డలే.
వాళ్ల గురించి మీకు తెలియదా? అంటూ సీఎం జగన్ చెప్పగానే సభలో వాళ్లంతా తెలుసు అంటూ రిప్లై ఇచ్చారు.
సీఎం జగన్ చెప్పిన మాటల్లో అన్నీ నిజాలే ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు.
సాక్ష్యాలు కావాలంటే యూట్యూబ్‌లో బోలెడు దొరుకుతాయి.కాబట్టి మేము అలా మాట్లాడలేదు.
అలా చేయలేదు అని చెప్పే ధైర్యం చేయకపోవచ్చు.ప్రస్తుతానికి తేలు కుట్టిన దొంగల్లా అందరూ ఉండిపోతారని తెలుస్తోంది.
ఏదీ ఏమైనా విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు, చెబుతున్న మాటలను ఏపీ ప్రజలు నమ్మే స్థితిలో లేరిన అర్థం అవుతోంది.ప్రతి పేదవానికి అండగా నిలిచేది వైసీపీ ప్రభుత్వమేనని ప్రజలు భావిస్తున్నారట.
దీన్ని బట్టి ఎవరెన్నీ ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో నీతి, నిజాయితీ, నిజానికే ప్రజలు పట్టం కట్టనున్నారు.అంతేకానీ పూటకో మాట చెప్తూ మభ్య పెట్టాలని చూస్తున్న విపక్షాలను నమ్మరని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వాలంటీర్లకు మద్ధతుగా నిలిచిన వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ పై పరువునష్టం కేసు వేసిందని సమాచారం.